సాంసంగ్ ఇండియా నుంచి బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో కొత్త మొబైల్ వచ్చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 (Samsung Galaxy F04) మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో (Smartphone Under Rs 10000) సాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 రిలీజ్ కావడం విశేషం. ఇందులో హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. బడ్జెట్ మొబైల్ కొనేవారికి ఇది మంచి ఆప్షన్. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 ఒకే వేరియంట్‌లో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. జనవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.7,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ ముగిసిన తర్వాత రూ.9,499 ధరకు లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కంపెనీ 2 ఏళ్లు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్ అందిస్తుంది.
Poco C50: రూ.7,000 లోపే పోకో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 13మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. జేడ్ పర్పుల్, ఓపల్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
సాంసంగ్ గత నెలలో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సాంసంగ్ గెలాక్సీ ఏ04, సాంసంగ్ గెలాక్సీ ఏ04ఇ మోడల్స్ పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఏ04 ప్రారంభ ధర రూ.11,999 కాగా, సాంసంగ్ గెలాక్సీ ఏ04ఇ ప్రారంభ ధర రూ.9,299. సాంసంగ్ గెలాక్సీ ఏ04 మొబైల్‌లో 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
UPI limit: యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్... గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం , అమెజాన్ పే వివరాలివే
ఇక సాంసంగ్ గెలాక్సీ ఏ04ఇ మొబైల్‌లో 6.5 అంగుళాల ఎల్‌సీడీ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 13మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Samsung, Samsung Galaxy, Smartphone