Home /News /technology /

Smartphones Under Rs 10,000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones Under Rs 10,000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones Under Rs 10,000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones Under Rs 10,000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones Under Rs 10,000 | ఇటీవల ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లోకి రూ.10,000 సెగ్మెంట్‌లో కొత్త మొబైల్స్ వచ్చాయి. వీటిలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.

    మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపేనా? మార్కెట్‌లో ఈ బడ్జెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. లో బడ్జెట్ రేంజ్ కావడంతో ఈ ధరలో స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. షావోమీ, రియల్‌మీ, సాంసంగ్‌తో పాటు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన మైక్రోమ్యాక్స్ కూడా రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో కొత్త మొబైల్స్ రిలీజ్ ఉన్నాయి. మరి ఏ మోడల్‌ ధర ఎంత, ప్రత్యేకతలు ఏంటీ? స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ధర రూ.8,999. రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది.

    Unlimited Data Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ ఇవే

    Google: మీ గూగుల్ అకౌంట్ ఎంతవరకు సేఫ్? ఈ సెట్టింగ్స్ మార్చండి

    Micromax IN 1: మైక్రోమ్యాక్స్ రూ.10,000 లోపు రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. ధర రూ.9,999. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 48 మెగగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.

    Samsung Galaxy F02s: సాంసంగ్ రిలీజ్ చేసిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ధర రూ.9,499.

    Smartphone Tips: పాత మొబైల్ అమ్ముతున్నారా? డేటా ఇలా డిలిట్ చేయండి

    WhatsApp: టైప్ చేయకుండా వాట్సప్ మెసేజెస్ పంపండి ఇలా

    Motorola Moto G10 Power: మోటోరోలా రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. మోటోరోలా మోటో జీ10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.8,799.

    Nokia C20 Plus: నోకియా ఇటీవల నోకియా సీ20 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనీసోక్ ప్రాసెసర్, 4,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ధర రూ.9,999.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Micromax, Mobile, Mobile News, Mobiles, Motorola, Nokia, Realme, Realme Narzo, Realme UI, Samsung, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు