TWS Earbuds: రూ.10 వేల లోపు బెస్ట్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీటిపై ఓ లుక్కేయండి

TWS Earbuds: రూ.10 వేల లోపు బెస్ట్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీటిపై ఓ లుక్కేయండి (ప్రతీకాత్మక చిత్రం)

TWS Earbuds | మీరు ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (True Wireless Earbuds) కొనాలనుకుంటున్నారా? మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.10,000 పైనే ఇయర్‌బడ్స్ ఉన్నాయి. మరి 10,000 లోపు బెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ఇవే.

  • Share this:
కరోనా తర్వాత ఆడియో ఉత్పత్తులకు మంచి క్రేజ్​ ఏర్పడింది. ముఖ్యంగా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (TWS) మార్కెట్ గణనీయంగా విస్తరించింది. స్మార్ట్‌ఫోన్ వాడేవారు టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి డిమాండ్​ పెరగడంతో అనేక స్మార్ట్​ ఉత్పత్తుల (Smart Products) తయారీ సంస్థలు వరుసగా ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేస్తున్నాయి కంపెనీలు. దాదాపు ప్రతి వారం ఏదో ఒక కొత్త ఇయర్​బడ్ (Earbuds) మార్కెట్​లోకి వస్తుండటంతో, దేన్ని కొనాలనే దానిపై వినియోగదారులు కన్​ఫ్యూజ్​ అవుతుంటారు. అయితే, మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గల ఇయర్​బడ్స్​ కొనాలంటే కాస్త ఖర్చు ఎక్కువే అవుతుంది. మీరు రూ. 10,000 వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, మంచి ట్రూ వైర్​లెస్​ ఇయర్​బడ్స్​ కొనొచ్చు. ప్రస్తుతం రూ.10 వేలలోపు మార్కెట్​లో లభిస్తున్న ఉత్తమ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​ (TWS Earbuds) ను పరిశీలిద్దాం.

Amazon Fab Phones Fest: అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

వన్​ప్లస్​ బడ్స్ ప్రో


వన్​ప్లస్​ సంస్థ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోనే కాదు ఇయర్​బడ్స్​ మార్కెట్​లోనూ ముందుంది. ఈ కంపెనీ గతేడాది భారత మార్కెట్​లోకి రూ. 9,990 విలువ గల టీడబ్ల్యూఎస్​ ఇయర్‌ఫోన్లను లాంచ్​ చేసింది. ఈ వన్​ప్లస్ బడ్స్ ప్రో ఇయర్​బడ్స్​ను వన్​ప్లస్​ నార్డ్​ 2 5జీతో పాటే ప్రారంభించింది. ఈ ఇయర్‌ఫోన్లు బ్లూటూత్ v5.2తో వస్తాయి. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, IPX4 వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. ఈ ఇయర్‌ఫోన్లను వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

జాబ్రా ఎలైట్ యాక్టివ్ 75t


జాబ్రా ఎలైట్ 75t కూడా బెస్ట్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్​గా రాణిస్తోంది. ఇది రూ. 9,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. జాబ్రా నాణ్యత, ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇది బెస్ట్ ఇయర్​బడ్​గా చెప్పవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. జాబ్రా ఎలైట్75t IP57 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్​, బ్లూటూత్ v5.0తో వస్తుంది. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, మల్టీపాయింట్ కనెక్షన్​ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది.

WhatsApp Chat Leaks: మీ వాట్సప్ ఛాట్స్ లీక్ అవుతున్నాయని డౌటా? ఈ టిప్స్ పాటించండి

శామ్సంగ్​ గెలాక్సీ బడ్స్​ ప్రో


రూ. 10వేలలోపు లభిస్తున్న బెస్ట్​ ఇయర్​బడ్స్​లో శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ముందు వరుసలో ఉంటుంది. దీన్ని శామ్సంగ్​ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 10,990 వద్ద, అమెజాన్​ వెబ్​సైట్​లో రూ. 9,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లు ఇంటెలిజెంట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తాయి. ఇది నాయిస్ క్యాన్సిలింగ్, పూర్తిగా సర్దుబాటు చేయగల యాంబియంట్ సౌండ్ ఫీచర్లతో వస్తుంది. మరోవైపు, దీనిలో IPX7 వాటర్ రెసిస్టెన్స్, 360-డిగ్రీ ఆడియో ఫీచర్లను అందించింది.

రియల్‌మీ బడ్స్ ఎయిర్ ప్రో


రియల్‌మే బడ్స్ ఎయిర్ ప్రో అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్​ ఇయర్​బడ్స్. ఈ టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్​ను కేవలం రూ. 4,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. రియల్​మీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్లు "ఇంటెలిజెంట్" నాయిస్ క్యాన్సిలేషన్‌ని ఎనేబుల్ చేసే S1 చిప్​సెట్​తో వస్తాయి. ఇవి 25 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తాయి.

Xiaomi 11 Lite 5G NE: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

ఒప్పో ఎన్కో ఎక్స్​


ఒప్పో ఎన్కో ఎక్స్​ కూడా బెస్ట్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్​గా పేరొందింది. దీన్ని ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రూ. 8,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, ఇతర ప్రముఖ రిటైలర్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఎన్కో ఎక్స్​ TWS ఇయర్‌ఫోన్లు బ్లూటూత్ v5.2తో వస్తాయి. 25 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తాయి. ఒప్పో ఎన్కో ఎక్స్​ IP54 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

నాయిస్ బడ్స్ సోలో


భారతీయ బ్రాండ్ నాయిస్ నుంచి విడుదలైన బడ్స్ సోలో ఇయర్​బడ్స్​ కేవలం రూ. 5,499 వద్ద లభిస్తుంది. కంపెనీ అధికారిక స్టోర్‌ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు. నాయిస్ బడ్స్ సోలో ఇన్-ఇయర్ డిటెక్షన్, టాన్స్‌ఫరెన్సీ మోడ్​ ఫీచర్లతో వస్తుంది. దీనిలో10ఎంఎం డ్రైవర్లను ఉపయోగించింది. దీనిలో హైపర్​సింక్​ టెక్నాలజీ గల బ్లూటూత్ v5.0ని ఉపయోగించింది.

బోట్ ఎయిర్‌డోప్స్ 501


యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్​తో వచ్చే బోట్ ఎయిర్‌డోప్స్ 501 ఇయర్​బడ్స్​- రూ. 3,999 ధర వద్ద లభిస్తాయి. బోట్ ఎయిర్‌డోప్స్​ను అమెజాన్, బోట్ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లు ఛార్జింగ్ కేస్‌తో సహా మొత్తం 28 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. గేమింగ్ కోసం “బీస్ట్ మోడ్”ను కూడా చేర్చింది.
Published by:Santhosh Kumar S
First published: