నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9

8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 24 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో కొత్త కోణాన్ని చూపించనుంది.

news18-telugu
Updated: October 12, 2018, 2:03 PM IST
నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9
సాంసంగ్ గెలాక్సీ ఏ9
  • Share this:
ట్రిపుల్ కెమెరాలతో గెలాక్సీ ఏ7 స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల సాంసంగ్ లాంఛ్ చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడా సౌత్ కొరియన్ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఈసారి ఏకంగా నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9 లాంఛ్ చేసింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 24 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో కొత్త కోణాన్ని చూపించనుంది. వెనుకవైపు వరుసగా కనిపించే నాలుగు కెమెరాలు... స్మార్ట్‌ఫోన్‌కు కొత్త లుక్ తీసుకొచ్చాయి.

నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9, Samsung Galaxy A9 Launched: Becomes First Phone With Four Cameras
సాంసంగ్ గెలాక్సీ ఏ9


ప్రపంచంలో నాలుగు కెమెరాలతో వచ్చిన తొలి ఫోన్ ఇదే అంటోంది సాంసంగ్. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్, క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ లాంటి మరిన్ని ప్రత్యేకతలున్నాయి. ఇన్‌బిల్ట్‌లో డిజిటల్ అసిస్టెంట్ బిక్స్‌బై, సాంసంగ్ పే, సాంసంగ్ హెల్త్ ఉంటాయి. నవంబర్‌లో ఈ ఫోన్ ఇండియాలో లాంఛ్ కానుంది. ఈ ఫోన్ ధరను అప్పుడే ప్రకటిస్తామని చెబుతోంది కంపెనీ.

నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9, Samsung Galaxy A9 Launched: Becomes First Phone With Four Cameras
సాంసంగ్ గెలాక్సీ ఏ9
సాంసంగ్ గెలాక్సీ ఏ9 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎస్అమొలెడ్ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 1080x2220 పిక్సెల్స్
ర్యామ్: 6 జీబీ, 8 జీబీ
Loading...
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 8+24+5+10 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 24 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3800 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: కేవియర్ బ్లాక్, లెమనేడ్ బ్లూ, బబుల్‌గమ్ పింక్

ఇవి కూడా చదవండి:

ఇంటర్నెట్ ఆగిపోతుందా? మీరేం చేయాలో తెలుసా?

ఇంపోర్ట్ టారిఫ్ ఎఫెక్ట్: స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి!

ఆధార్ నెంబర్‌ చెప్తే అప్పు ఇచ్చేస్తారు!

ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అయిందా? అక్టోబర్ 15 లోగా రివైవల్‌ చేయొచ్చు!

ఇండియాలో లాంఛైన నోకియా 3.1 ప్లస్

బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!

Photos: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: వీడియో గేమ్స్‌పై భారీ ఆఫర్లు

Photos: 2018లో మదుపరులకు గుండెకోత మిగిల్చిన 10 స్టాక్స్ ఇవే!
First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...