ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7

ట్రిపుల్ కెమెరాలతో గెలాక్సీ ఏ7 స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది సాంసంగ్. మూడు కెమెరాలు యూజర్లకు ఫోటోగ్రఫీలో సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి.

news18-telugu
Updated: September 25, 2018, 2:38 PM IST
ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7
(Image: Samsung)
  • Share this:
సాంసంగ్ లవర్స్‌కి ఇది పెద్ద శుభవార్త. వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో గెలాక్సీ ఏ7 స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ ధర రూ.23,990 నుంచి ప్రారంభమవుతుంది. ప్రివ్యూ సేల్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆన్‌లైన్ ఇ-స్టోర్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా ఈ నెల 27, 28న జరగనుంది. అన్ని ప్లాట్‌ఫామ్స్‌పై సెప్టెంబర్ 29న అందుబాటులోకి రానుంది. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు రూ. 2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

24 మెగాపిక్సెల్ ఏఎఫ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్‌ లెన్స్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు యూజర్లకు ఫోటోగ్రఫీలో సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి. "లైవ్ ఫోకస్" ఫీచర్‌తో యూజర్లు డెప్త్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు 'బొకే' ఎఫెక్ట్‌తో మంచి ఫోటోలు చిత్రీకరించొచ్చు. ఇది మాత్రమే కాదు... నాలుగు రియర్ కెమెరాలతో మలేషియాలో అక్టోబర్ 11న ఏ9 రిలీజ్ చేయనుంది సాంసంగ్. ఈ ఫోన్ ధర రూ.30,000 కన్నా ఎక్కువగా ఉంటుంది.

సాంసంగ్ గెలాక్సీ ఏ7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 1080x2280 పిక్సెల్స్, 18.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: 2.2 గిగాహెర్జ్రియర్ కెమెరా: 24+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 24 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, బ్లాక్, గోల్డ్, పింక్
ధర: సుమారు రూ.23,990

ఇవి కూడా చదవండి:

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

ఫోర్బ్స్ భావి సంపన్నులుగా ఉపాసన, పీవీ సింధు!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

యూత్ కోసం మరో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్!

Video: ఎక్కువగా క్రెడిట్ కార్డులు, లోన్లు ఉంటే నష్టాలేంటీ?
Published by: Santhosh Kumar S
First published: September 25, 2018, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading