Home /News /technology /

SAMSUNG GALAXY A53 5G SMARTPHONE LAUNCH IN INDIA PRICE AND SPECIFICATIONS ARE DETAILED HERE GH VB

Samsung New Phone: గుడ్ న్యూస్.. భారత్ లో శామ్​సంగ్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. ఆ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శామ్​సంగ్​ నుంచి మరో మిడ్​రేంజ్ స్మార్ట్​ఫోన్ రిలీజైంది. శామ్​సంగ్​ తన గెలాక్సీ A సిరీస్​లో A53 5జీ మొబైల్​ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది.

దక్షిణ కొరియా(South Korea) మొబైల్ దిగ్గజం శామ్​సంగ్​ నుంచి మరో మిడ్​రేంజ్ స్మార్ట్​ఫోన్ రిలీజైంది. శామ్​సంగ్​ తన గెలాక్సీ A సిరీస్​లో A53 5జీ మొబైల్​ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. దీనిలో ఒప్పో ఫైండ్ X3 సిరీస్​తో సమానమైన ఫీచర్లను అందించింది. ఇది వన్​ప్లస్​ నార్డ్​ 2, షియోమి 11 ఎక్స్​ వంటి మిడ్​రేంజ్ ఫోన్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. శామ్​సంగ్​ గెలాక్సీ A53 5G స్మార్ట్​ఫోన్​లో​ 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే, కొత్త శామ్​సంగ్ ఎక్సినోస్​ 1280 చిప్‌సెట్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. "షేక్-ఫ్రీ" ఇమేజ్‌లు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ను ఎనేబుల్ చేసింది. శామ్​సంగ్​ గెలాక్సీ ఏ53 ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

Apple iPhone: యాపిల్ కంపెనీపై ఆగ్రహంతో ఐఫోన్ యూజర్లు.. కారణం ఏంటో తెలుసా..


శామ్​సంగ్​ గెలాక్సీ A53 5G ధర

శామ్​సంగ్​ గెలాక్సీ A53 5G బ్లాక్, వైట్, లైట్ బ్లూ, పీచ్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. భారతదేశంలో దీని బేస్ 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 34,499 నుండి ప్రారంభమవుతుంది. టాప్ 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ రూ. 35,999 వద్ద లభిస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్‌ని ఉపయోగించి 1 టీబీ వరకు స్టోరేజ్​ను విస్తరించుకోవచ్చు. గెలాక్సీ A53 5G స్మార్ట్​ఫోన్​ Samsung.com, రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి వస్తుంది. మార్చి 21 నుంచి 31 మధ్య ప్రీ-బుక్​కు అందుబాటులో ఉంటుంది. ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లు మార్చి 25, 2022 నుండి కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ A53 5Gని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు రూ. 3,000 విలువైన క్యాష్‌బ్యాక్ లేదా రూ. 2,000 విలువైన శామ్​సంగ్​ ఫైనాన్స్​ ప్లస్​ క్యాష్‌బ్యాక్‌ పొందేందుకు అర్హులు.

శామ్​సంగ్​ గెలాక్సీ A53 5G స్పెసిఫికేషన్లు

శామ్​సంగ్​ గెలాక్సీ A53 5G స్మార్ట్​ఫోన్​ 6.5 -అంగుళాల ఫుల్- హెచ్​డీ ప్లస్​ సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. గెలాక్సీ ఏ -సిరీస్‌లో మొదటిసారిగా ఎక్సినోస్​ 1280 చిప్‌సెట్​ను అందించింది. ఇది16GB ర్యామ్​తో పాటు రోమ్​ని ఉపయోగించే ర్యామ్​ ప్లస్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది.

Google Update: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్​ గుడ్​న్యూస్.. వాటిని డిలీట్ చేసేందుకు కొత్త ఫీచర్..


ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. దీన్ని కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చని కంపెనీ​ తెలిపింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 12పై పని చేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. శామ్​సంగ్ గెలాక్సీ A53 5G క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇది OISతో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 12- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 5- మెగాపిక్సెల్ షూటర్‌లను కూడా కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32- మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను చేర్చింది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Samsung, Samsung Galaxy, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు