సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ53 (Samsung Galaxy A53), సాంసంగ్ గెలాక్సీ ఏ33 (Samsung Galaxy A33) మోడల్స్‌ని పరిచయం చేసింది సాంసంగ్. వర్చువల్ లైవ్ ఈవెంట్‌లో ఈ రెండు కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేసింది. మంచి కెమెరా ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని దృష్టిలో పెట్టుకొని సాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్లను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, నాక్స్ సెక్యూరిటీ, సరికొత్త ప్రాసెసర్, రెండు రోజుల బ్యాటరీ లైఫ్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ53 ప్రారంభ ధర సుమారు రూ.31,000 కాగా, సాంసంగ్ గెలాక్సీ ఏ53 ప్రారంభ ధర సుమారు రూ.38,000. హైఎండ్ ఫీచర్స్‌తో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసింది సాంసంగ్. ఏప్రిల్ 1న సేల్ మొదలవుతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు.
సాంసంగ్ గెలాక్సీ ఏ33
సాంసంగ్ గెలాక్సీ ఏ33 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా డీటెయిల్స్ చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 48మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా + 5మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
It’s Awesome, and it’s for everyone. #GalaxyA53 5G is here.
The all-new Awesome Galaxy A53 5G with OIS Camera helps you capture smooth and stable, bright photos/videos even in low light. pic.twitter.com/zkOjWgF0F8
సాంసంగ్ గెలాక్సీ ఏ33, సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్‌లో కొన్న కామన్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో సాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది. 5జీ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రిలీజైంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.