దక్షిణ కొరియా (South Korea) ఎలక్ట్రానిక్స్ దిగ్గడం శామ్ సంగ్ (Samsung) నుంచి వచ్చే స్మార్ట్ పోన్లకు (Smart Phones) ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. శామ్ సంగ్ ఫోన్లంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. అందుకే ఎప్పటికప్పుడు అధునాత ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తుంటుంది. ఇటీవలే శామ్ సంగ్ గెలాక్సీ A52sను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్ బ్రాండ్ శామ్ సంగ్ నుంచి గత నెలలో విడుదలైన శామ్ సంగ్ గెలాక్సీ A52s 5జీలో మింట్ కలర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 28న ఇది బ్లాక్, పర్పుల్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో విడుదలవ్వగా.. వీటికి అదనంగా ఇప్పుడు మింట్ కలర్ వచ్చి చేరింది. అయితే, కలర్ మినహా మిగతా ఫీచర్లన్నీ పాత ఫోన్లోని మాదిరిగానే ఉంటాయని శామ్సంగ్ స్పష్టం చేసింది. శామ్ సంగ్ గెలాక్సీ A52s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై నడుస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ A52s 5G ధర
శామ్సంగ్ గెలాక్సీ A52s 5జీ (రివ్యూ) మింట్ కలర్ ఆప్షన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది రూ. 37,999 ధర వద్ద లభిస్తుంది. మరోవైపు, దీని 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 35,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ శామ్సంగ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ పై తాజాగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 6 వేల డిస్కౌంట్ అందిస్తుంది.
శాశామ్ సంగ్ గెలాక్సీ A52s 5G స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) శామ్ సంగ్ గెలాక్సీ A52s 5జీ ఆండ్రాయిడ్ 11- ఆధారిత వన్ యూఐ 3 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇది 6.5 -అంగుళాల ఫుల్-హెచ్డి+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సహాయంతో స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.
ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో టెలిఫోటో సెన్సార్ కెమెరాలతో కూడిన క్వాడ్ రియర్ కెమెరాసెటప్‌ను అందించింది. మరోవైపు, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32 మెగాపిక్సెల్ ప్రైమరీ సెల్ఫీ షూటర్ కెమెరాను చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటివి అందించింది. దీనిలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించింది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samsung Galaxy, Technology