సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ (Samsung Galaxy A52s 5G) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది సాంసంగ్. గెలాక్సీ ఏ సిరీస్‌లో సాంసంగ్ రిలీజ్ చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఏ52 మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ ఈ స్మార్ట్‌ఫోన్. గత నెలలో యూకేలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇండియాలో ఈ మోడల్‌ను రిలీజ్ చేసింది సాంసంగ్. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, అమొలెడ్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ 2, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, పోకో ఎఫ్3 జీటీ, ఎంఐ 11ఎక్స్స్మార్ట్ఫోన్లకు సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ గట్టి పోటీ ఇవ్వనుంది.
ధర ఎంత?
సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ కూడా మొదలైంది. అమెజాన్, సాంసంగ్ అధికారిక వెబ్సైట్, రీటైల్ ఔట్‌లెట్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.3,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసే కస్టమర్లకు రూ.3,000 అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25వాట్ ఛార్జర్ బాక్సులోనే వస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 189 గ్రాములు. ఆసమ్ బ్లాక్, ఆసమ్ వైట్, ఆసమ్ వయొలెట్ కలర్స్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.