Samsung Galaxy A52s 5G: శాంసంగ్ లవర్స్​కు బ్యాడ్​న్యూస్​.. గెలాక్సీ ఎ52 4జి స్మార్ట్​ఫోన్​ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే?

ఫోన్ల ధరలు పెంచుతున్న శాంసంగ్.. వినియోగదారులకు షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​​ శాంసంగ్ తన యూజర్లకు షాకిచ్చింది. శామ్​సంగ్​ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ల ధరలు పెరిగాయి.

  • Share this:
దక్షిణ కొరియాకు (South Korea) చెందిన ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​​ శాంసంగ్ (Samsung) తన యూజర్లకు షాకిచ్చింది. శామ్​సంగ్​ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ల (Smart Phones) ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. శామ్​సంగ్​ భారత మార్కెట్​లోకి ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ A52s 5 జి వేరియంట్​ను రిలీజ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్​ఫోన్​కు అనూహ్యమైన స్పందన వస్తోంది. అయితే, శామ్​సంగ్​ తాజాగా తన గెలాక్సీ A52 ​4 జి వేరియంట్​ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్​ ధరను భారత మార్కెట్​లో రూ .1,000 పెంచేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ మార్చిలో విడుదలవ్వగా.. కొద్ది నెలల్లోనే రూ. 1000 ధర పెరగడం గమనార్హం.

శామ్​సంగ్​ గెలాక్సీ A52 కొత్త ధర

శామ్సంగ్ గెలాక్సీ A52 4 జి మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరనూ కంపెనీ ఇప్పడు పెంచేసింది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇప్పటివరకు రూ .26,499 వద్ద లభిస్తుండగా.. ఇకపై రూ .27,499 ధర వద్ద లభించనుంది. మరోవైపు, 8GB ర్యామ్​, 128GB ఇంటర్నల్​ స్టోరేజ్​ వేరియంట్ ఇప్పటివరకు రూ .27,999 వద్ద లభిస్తుండగా.. దీని ధరను రూ .28,999 కు పెంచేసింది. ప్రస్తుతం అమెజాన్​, శామ్​సంగ్​ వెబ్​సైట్లలో వీటిని కొత్త ధరలతోనే అమ్మకానికి పెట్టింది.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు స్టార్ ప్లేయర్ అనుమానమే.. అదే జరిగితే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు


 గెలాక్సీ A52 స్పెసిఫికేషన్లు


శామ్‌సంగ్ గెలాక్సీ A52 5G ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB ర్యామ్​ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండింటిలోనూ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించింది. మైక్రో ఎస్​డీ కార్డ్‌ సహాయంతో ఈ స్టోరేజ్​ని మరింతగా విస్తరించవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 52 ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 -అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌, IP67 రేటింగ్‌ కలిగి ఉంటుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. 64MP మెయిన్ సెన్సార్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP బొకే సెన్సార్, 5MP మాక్రో సెన్సార్‌తో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌ని అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో 32MP ఫ్రంట్ సెన్సార్​ కెమెరాను చేర్చింది. ఇది 2500 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో కూడిన 4500mAh బ్యాటరీతో వస్తుంది. శామ్​సంగ్​ భాటలోనే ఇతర స్మార్ట్​ఫోన్​ సంస్థలు కూడా నడుస్తున్నాయి. షియోమి ఇటీవల తన రెడ్‌మి సిరీస్​లోని ఆరు బేస్ వేరియంట్ల ధరలను పెంచేసింది.

Maria Sharapova: వెనీస్ బీచ్‌లో బికినీతో మారియా షరపోవా సందడి.. కాబోయే భర్తతో కలసి షికార్లు

Published by:John Naveen Kora
First published: