ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ కోసం మంచి కెమెరా ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కొనాలనుకునేవారికి అలర్ట్. ఇటీవల 50మెగాపిక్సెల్ ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్‌తో సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ (Samsung Galaxy A23 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. సేల్ కూడా కొనసాగుతోంది. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కొనొచ్చు. సిల్వర్, లైట్ బ్లూ, ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తోంది.
అమెజాన్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ మొబైల్ కొనాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. రూ.1,100 లోపే ఈఎంఐ మొదలవుతుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి భారీగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.20,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.
Missed Call Fraud: బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్న మిస్డ్ కాల్ ఫ్రాడ్... ఈ టిప్స్ గుర్తుంచుకోండి
సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గతేడాది రిలీజైన ఈ ప్రాసెసర్ బాగా పాపులర్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 16జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. నో షేక్ క్యామ్ ఫీచర్ ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్... రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 + వన్‌యూఐ కోర్ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Samsung, Samsung Galaxy, Smartphone