Home /News /technology /

SAMSUNG GALAXY A22 TO RELEASE SOON IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 వస్తోంది... ధర రూ.20,000 లోపే

Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 వస్తోంది... ధర రూ.20,000 లోపే

Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 వస్తోంది... ధర రూ.20,000 లోపే

Samsung Galaxy A22 | సాంసంగ్ నుంచి మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఏ22 ప్రత్యేకతలు తెలుసుకోండి.

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ అభిమానులకు శుభవార్త. సంస్థ నుంచి త్వరలో విడుదల కానున్న సాంసంగ్ గెలాక్సీ ఏ 22 (Samsung Galaxy A22) స్మార్ట్‌పోన్ ధరల వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. భారత్‌లో గెలాక్సీ ఏ 22 స్మార్ట్‌ఫోన్‌ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆవిష్కరించిన ఏ22 డివైజ్‌ను త్వరలో మన దేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4G టెక్నాలజీతో పనిచేస్తుంది. హెలియో G80 SoC చిప్‌సెట్, 6.4 అంగుళాల హెచ్‌డి ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ స్క్రీన్‌.. వంటి మెరుగైన ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకర్షిస్తోంది.

ఏ22 స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్, 5,000 mAh బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, ఇతర ఫీచర్లను సాంసంగ్ తక్కువ ధరలోనే అందించనుంది. అయితే ఏ22 స్మార్ట్‌ఫోన్‌ ఇతర మెమరీ కాన్ఫిగరేషన్లను భారత్‌లో విడుదల చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా నాలుగు కలర్ ఆప్షన్లలో కాకుండా.. కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. సంస్థ ఆవిష్కరించిన పోస్టర్‌లో కూడా రెండు కలర్ వేరియంట్ల ఫోటోలు మాత్రమే ఉన్నాయి.

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్... డిస్కౌంట్ వివరాలు ఇవే

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్

మొత్తం ఐదు కెమెరాలు


గెలాక్సీ ఏ22 4జీ స్మార్ట్‌ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలు ఉంటాయి. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (ఓఐఎస్‌), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ యూనిట్లు.. మొత్తం ఐదు అధునాతన లెన్స్‌ దీన్ని రూపొందించారు.

భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?


గెలాక్సీ ఏ22 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సాంసంగ్ ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించింది. అయితే దీని ధర, పూర్తి ఫీచర్లు, భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ డివైజ్‌ను భారత్‌తో పాటు ఆసియా దేశాల్లో విడుదల చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Jio Recharge via WhatsApp: జియో సిమ్ రీఛార్జ్ చేయాలా? వాట్సప్‌లో చేయండిలా

Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

మార్కెట్లోకి మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్


సాంసంగ్ ఇటీవల గెలాక్సీ ఎం32 (Galaxy M32) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ డివైజ్ రెండు కలర్ ఆప్షన్లు, రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB+64GB; 6GB+128GB స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని ఆవిష్కరించారు. జూన్ 28 నుంచి అమెజాన్, సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గెలాక్సీ ఎం 32 స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. 4జీబీ వేరియంట్ ధర రూ.14,999, 6.జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ప్రారంభ ఆఫర్‌గా ఈ రెండు వేరియంట్లపై రూ.1,250 వరకు క్యాష్‌బ్యాక్ పొందే ఆఫర్‌ను సైతం సాంసంగ్, అమెజాన్ అందిస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు