సాంసంగ్ మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ మోడల్‌ను రిలీజ్ చేసింది. 11 5జీ బ్యాండ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావడం విశేషం. సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్ గత నెలలో యూరప్‌లో రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ మోడల్ కూడా ఉంది. ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ మోడల్ రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ ప్రారంభ ధర రూ.19,999. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.21,999. జూలై 25న సేల్ మొదలవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Samsung #GalaxyA225G is here to make things even more awesome for you. It’s 11 band 5G network support will ensure that you enjoy downloading, streaming & gaming seamlessly on 5G; whenever you want, wherever you are! pic.twitter.com/RvzIKmQ1JF
సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్కోర్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గ్రే, మింట్, వయొలెట్ కలర్స్‌లో కొనొచ్చు. ఇక గత నెలలో రూ.18,499 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ మోడల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రూ.1,500 ఎక్కువ ధరకే ఇదే మోడల్లో 5జీ మొబైల్ రిలీజ్ చేసింది సాంసంగ్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రియల్మీ ఎక్స్ 7 5జీ, ఐకూ జెడ్3 మోడల్స్‌కు పోటీ ఇవ్వనుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.