సాంసంగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కంపెనీ. జూన్ 17న సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ యూకేలో లాంఛ్ అయింది. ఫీచర్స్ అన్నీ తెలిసినవే. క్వాడ్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ బడ్జెట్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Awesomeness that goes on and on! The new Samsung #GalaxyA21s is coming your way. Follow this space to know more. #Samsung pic.twitter.com/YOuShYFeIF
— Samsung India (@SamsungIndia) June 15, 2020
సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ ప్రాసెసర్
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+వన్ యూఐ
కలర్స్: బ్లాక్, బ్లూ, వైట్
ధర: సుమారు రూ.17,000
ఇవి కూడా చదవండి:
Smartphone: జూన్‌లో రూ.20,000 లోపు బెస్ట్ 7 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
WhatsApp: గుడ్ న్యూస్... ఒకే వాట్సప్ అకౌంట్ నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు
Jio Plans: 4జీ డేటా నుంచి ఉచిత కాల్స్ వరకు... జియో నుంచి బెస్ట్ ప్లాన్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Android 10, Samsung, Smartphone, Smartphones