సాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఇప్పటికే యూకే మార్కెట్‌లో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది కంపెనీ. ఇన్ఫినిటీ ఓ హోల్ పంచ్ డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా, ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ రిలీజ్ కాగానే సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు అన్ని రీటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.