Samsung Phone Explodes: ఫ్లైట్‌లో పేలిన సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్... తర్వాత ఏం జరిగిందంటే

Samsung Phone Explodes: ఫ్లైట్‌లో పేలిన సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్... తర్వాత ఏం జరిగిందంటే (పేలిన స్మార్ట్‌ఫోన్ ఇది కాదు. ఇది ప్రతీకాత్మక చిత్రం మాత్రమే)

Samsung Phone Explodes | ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఫ్లైట్ లోపల సాంసంగ్ గెలాక్సీ ఏ 21 (Samsung Galaxy A21) స్మార్ట్‌ఫోన్ పేలింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి.

  • Share this:
    సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్‌లో పేలింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ (Alaska Airlines) ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఫ్లైట్‌లో పేలుడు శబ్దం రావడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్‌లోని సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను ఫ్లైట్‌లోంచి కిందకు దించేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే సాంసంగ్ (Samsung) ఫోన్ పేలడం వల్ల మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్ని అత్యవసరంగా కిందకు దించేశారు. అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 751 సీటిల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.

    మొదట ఫ్లైట్‌లో మంటలు కనిపించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఫ్లైట్‌లో మంటలు చెలరేగినట్టు తెలియగానే పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందా అని విచారణ జరిపారు. చివరకు తన స్మార్ట్‌ఫోన్ పేలినట్టు ఓ ప్యాసింజర్ చెప్పడంతో అసలు విషయం తెలిసింది. అది సాంసంగ్ గెలాక్సీ ఏ21 (Samsung Galaxy A21) మోడల్ అని తేలింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఏడాది క్రితం కొన్నట్టు సదరు ప్యాసింజర్ వివరించారు. అయితే స్మార్ట్‌ఫోన్ పేలడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. వైరింగ్ లేదా బ్యాటరీలో లోపాల కారణంగా స్మార్ట్‌ఫోన్ పేలినట్టు భావిస్తున్నారు.

    Nothing Ear 1: నథింగ్ ఇయర్ 1 సేల్ డేట్ ఫిక్స్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి


    కొంతకాలం క్రితం సాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ పేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఏ21 పేలడం అప్పటి ఘటనను గుర్తు చేసింది. ఇలాంటి ఘటనలు సాంసంగ్ కంపెనీకి చికాకుగా మారుతున్నాయి. 2016లో సాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పేలడానికి బ్యాటరీ తయారీలో అతిపెద్ద లోపం అని తేలింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన వెంటనే పేలడం అప్పట్లో చర్చనీయాంశమైంది. వెంటనే రంగంలోకి దిగిన సాంసంగ్ అన్ని స్మార్ట్‌ఫోన్లను రీకాల్ చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్‌పై నిషేధం కూడా విధించారు.

    Realme X7 Max 5G: రూ.26,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా

    గెలాక్సీ నోట్ 7 పేలడం వల్ల సాంసంగ్ కోట్ల రూపాయలు నష్టపోవడం మాత్రమే కాదు కంపెనీ బ్రాండ్‌కు తీవ్ర నష్టం కలిగించింది. అన్ని ఫ్లైట్లలో సాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను నిషేధించారు. అప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్లు కొన్నవారికి సాంసంగ్ రీఫండ్స్ ఇచ్చింది. క్షమాపణలు కూడా చెప్పింది. తాజాగా జరిగిన ఘటన కూడా 2016లో జరిగిన ఘటనను గుర్తు చేస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఏ21 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయి ఏడాదైనా ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు జరగలేదు. పేలిన సాంసంగ్ గెలాక్సీ ఏ21 పూర్తిగా దెబ్బతినడంతో ఈ స్మార్ట్‌ఫోన్ పేలడానికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులకు సాధ్యం కాలేదు.
    Published by:Santhosh Kumar S
    First published: