సాంసంగ్ ఇండియా రెండు రోజుల క్రితం సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో (Amazon Great Republic Day Sale) సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ మొబైల్ సేల్ ప్రారంభమైంది. ఎస్‌బీఐ కార్డ్ (SBI Card) ఉన్నవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. సాంసంగ్ ఇండియా గెలాక్సీ ఏ సిరీస్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.16,499. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.15,000 లోపే సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ప్రత్యేకతలు తెలుసుకోండి.
సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999. బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్... రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
If fast and awesome is what you want, then #GalaxyA14 5G is perfect for you. It comes with #Awesome5G, 2-day battery life, a super-fast processor and One UI to #AmpYourAwesome. Don’t wait, own it now at just ₹ 14999* inclusive of cashback offers. T&C apply. pic.twitter.com/5E4Mylw9CR
— Samsung India (@SamsungIndia) January 19, 2023
సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే ఉంది. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన మొదటి మొబైల్ ఇదే. ఇందులో 8జీబీ ర్యామ్ వరకు సపోర్ట్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 8జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 + వన్‌యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2 ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
UPI Scam: యూపీఐ పేమెంట్స్‌లో భారీగా మోసాలు... ఈ టిప్స్ గుర్తుంచుకోండి
సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉండగా 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ ఉంది. ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు స్మార్ట్‌ఫోన్ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Samsung, Samsung Galaxy, Smartphone