Home /News /technology /

SAMSUNG GALAXY A03 WITH 65 INCH HD PLUS DISPLAY 48MP CAMERA 5000MAH BATTERY LAUNCHED IN INDIA HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS GH

Samsung Galaxy A03: ఇండియన్ మార్కెట్లోకి సాంసంగ్ గెలాక్సీ A03 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శామ్‌సంగ్‌ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ A03 (Samsung Galaxy A03) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను(Smartphone) లాంచ్ చేసింది. ఈ సంవత్సరంలో శామ్‌సంగ్‌ కంపెనీ A03 సిరీస్‌లో తీసుకొచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే.

ఇంకా చదవండి ...
ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రతివారం మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్లు(Smartphones) వస్తున్నాయి. వివిధ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకొంటున్నాయి. అదే కోవలో శామ్‌సంగ్‌(Samsung) కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ A03 (Samsung Galaxy A03) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరంలో శామ్‌సంగ్‌ కంపెనీ A03 సిరీస్‌లో తీసుకొచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. మొత్తంగా A03 సిరీస్‌లో వచ్చిన మూడో మోడల్ ఇది. ఇంతకు ముందు ఈ సిరీస్‌లో Samsung Galaxy A03s, Samsung Galaxy A03 Core మోడళ్లను కంపెనీ విడుదల చేసింది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఎంట్రీ లెవల్‌ ఫోన్‌గా Samsung Galaxy A03 స్మార్ట్‌ఫోన్‌ను చెప్పవచ్చు. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంత.. ఎప్పటి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుందో చూద్దాం.

ఇండియాలో Samsung Galaxy A03 ధర ఎంత?
ఇండియాలో 3 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో Samsung Galaxy A03 ధరను రూ.10,499గా నిర్ణయించారు. అదే విధంగా 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.11,999గా ప్రకటించారు. బ్లాక్‌, బ్లూ, రెడ్‌ కలర్లలో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. Samsung.com తో పాటు అన్ని ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఇండియాలోని అన్ని ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు జరుగుతాయి.
Google: ఆండ్రాయిడ్‌ యూజర్లకు షాక్.. గూగుల్‌ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ ఫీచర్ ఔట్

ఫీచర్లు
Samsung Galaxy A03లో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ ప్యానల్‌ అందిస్తున్నారు. ఇందులో 720*1600 పిక్సెల్స్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌, 60Hz స్టాండర్డ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన వాటర్‌ప్రూఫ్‌ డిస్‌ప్లేను పొందుపరిచారు. వైర్డ్‌, వైర్లెస్‌ హెడ్‌సెట్‌లకు సపోర్ట్‌ చేసే డాల్బీ అట్మోస్‌ సౌండ్‌ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఆక్టాకోర్‌ యూనిసాక్‌ T606 ప్రాసెసర్‌ను Galaxy A03లో వినియోగించారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టి.బి. వరకు పెంచుకొనే సదుపాయం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్‌ 11 బేస్డ్‌ వన్ యూఐ 3.1 కోర్‌ ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టంపై ఈ డివైజ్ పని చేస్తుంది.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనే వారికి భారీ షాక్

Galaxy A03 స్మార్ట్‌ఫోన్‌లో రెండు కెమెరాలను అందిస్తున్నారు. ఫోన్‌ వెనుక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ ఉంటుంది. 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌తో లైవ్‌ ఫోకస్‌తో పోర్‌ట్రైట్‌ ఫొటోలను తీయవచ్చు. ముందు వైపు Galaxy A03కి 5 ఎంపీ బ్యూటీ మోడ్‌ కెమెరాను అందించారు. Galaxy A03లో స్మార్ట్‌ సెల్ఫీ యాంగిల్‌ ఫీచర్‌తోపాటు, ఎక్కువ మందితో సెల్ఫీ తీసుకొంటున్న సమయంలో ఆటోమేటిక్‌గా వైడ్‌ యాంగిల్‌ సెల్ఫీ తీస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Samsung, Samsung Galaxy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు