Home /News /technology /

Samsung Galaxy A03: శామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్‌ 12ను పోలిన కెమెరా మాడ్యుల్‌.. ఇతర ప్రత్యేకతలివే..

Samsung Galaxy A03: శామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్‌ 12ను పోలిన కెమెరా మాడ్యుల్‌.. ఇతర ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శామ్‌సంగ్ గెలాక్సీ A03 (Samsung Galaxy A03) డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 2MP f/2.4 డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. దీంతోపాటు 5MP సామర్థ్యం ఉన్న f/2.2 ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో ఫోన్‌ను అభివృద్ధి చేశారు.

ఇంకా చదవండి ...
ప్రీమియం ఫోన్లతో పాటు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోనూ దూసుకుపోతోంది శామ్‌సంగ్ (Samsung). భారత్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో(Smartphone Market) తన వాటాను పెంచుకుంటోంది. తాజాగా శామ్‌సంగ్ గెలాక్సీ A03 (Samsung Galaxy A03) పేరుతో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ (Budget Smartphone) ను ఆవిష్కరించింది. ఇది గెలాక్సీ A సిరీస్‌లో రానున్న మూడో స్మార్ట్‌ఫోన్. ఈ టెక్ దిగ్గజం ఇంతకు ముందే Galaxy A03s మోడల్‌ను లాంచ్ చేసింది. అనంతరం గెలాక్సీ A03 కోర్ (Galaxy A03 Core) మోడల్‌ను ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల చేసింది. తాజాగా లాంచ్ చేసిన వనిల్లా గెలాక్సీ A03 డివైజ్‌లో.. ఐఫోన్ 12ను పోలి ఉండే కెమెరా మాడ్యూల్ సెటప్‌ ఉంటుంది. ఈ డివైజ్‌ను దశల వారీగా వివిధ దేశాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A03 డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 2MP f/2.4 డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. దీంతోపాటు 5MP సామర్థ్యం ఉన్న f/2.2 ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో ఫోన్‌ను అభివృద్ధి చేశారు. డిస్‌ప్లే పైభాగంలో వాటర్-డ్రాప్ నాచ్‌తో ఆ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ LCD డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.6GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. డివైజ్‌ ప్రాసెసర్ గురించి పూర్తి వివరాలను శామ్‌సంగ్ ప్రకటించలేదు. అయితే బడ్జెట్ యునిసోక్ ప్రాసెసర్‌ను (Unisoc processor) డివైజ్‌లో ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Smart Speakers: మంచి స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే

శామ్‌సంగ్ గెలాక్సీ A03 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. దీంట్లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. అయితే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ ఈ డివైజ్‌ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే సౌండ్ సిస్టమ్‌ ఇందులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం బ్లాక్, బ్లూ, రెడ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ డివైజ్‌ను మొత్తం మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో ఆవిష్కరించింది. 3GB + 32GB, 4GB + 64GB, 4GB + 128GB మోడళ్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు.
WhatsApp Web: వాట్సాప్​లో అదిరిపోయే ఫీచర్​.. స్టిక్కర్లను స్వయంగా డిజైన్​ చేసుకునే ఛాన్స్​.. ఎలాగంటే?

డ్యుయల్ నానో-సిమ్ కార్డ్స్‌తో రానున్న ఈ డివైజ్‌ను.. 164.20 x 75.90 x 9.10mm కొలతలతో రూపొందించారు. Wi-Fi, మైక్రో-USB వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఫోన్‌లోని సెన్సార్‌లలో యాక్సెలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ప్రస్తుతానికి శామ్‌సంగ్ గెలాక్సీ A03 ధరను సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ఈ డివైజ్ త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్‌లో లాంచ్ అయిన తరువాతే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Samsung, Samsung Galaxy, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు