Home /News /technology /

SAMSUNG GALAXY A03 CORE SMARTPHONE LAUNCHED IN INDIA PRICED AT RS 7999 SS

Samsung Galaxy A03 Core: సాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.7,999 మాత్రమే

Samsung Galaxy A03 Core: సాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.7,999 మాత్రమే
(image: Samsung India)

Samsung Galaxy A03 Core: సాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.7,999 మాత్రమే (image: Samsung India)

Samsung Galaxy A03 Core | సాంసంగ్ ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. కేవలం రూ.7,999 ధరకే సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ (Samsung Galaxy A03 Core) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది సాంసంగ్.

    తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. సౌత్ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం అయిన సాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ (Samsung Galaxy A03 Core) మొబైల్ ఇండియాలో రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 మాత్రమే. గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా ఈ మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్ మోడల్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ కూడా మొదలైంది. సాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌లో కొనొచ్చు.

    ఇటీవల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇన్నాళ్లూ ఫీచర్ ఫోన్స్ వాడినవాళ్లు స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. దీంతో రూ.10,000 లోపు సెగ్మెంట్‌లోని స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోకో సీ31 (Poco C31), రియల్‌మీ సీ21వై (Realme C21Y), సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 (Samsung Galaxy F12), రియల్‌మీ సీ25వై (Realme C25Y), రియల్‌మీ నార్జో 50ఏ (Realme Narzo 50A), మోటోరోలా ఇ40 (MOTOROLA e40) లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ రూ.10,000 లోపు బడ్జెట్‌లో బాగా సేల్ అవుతున్నాయి.

    Redmi Note 11T 5G: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ సేల్... తొలి సేల్‌లో రూ.2,000 డిస్కౌంట్

    సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఇన్ఫినిటీ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. Unisoc SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కేవలం 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ స్మార్ట్‌ఫోన్‌లో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

    Smartphone Tips: స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటే వచ్చే యాడ్స్‌కు బ్రేక్ వేయండి ఇలా

    ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ + సాంసంగ్ వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే యాప్స్ అన్నీ లైట్ వర్షన్‌లో ఉంటాయి. అంటే ఈ యాప్స్ సైజ్ రెగ్యులర్ యాప్ సైజ్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సేఫ్ ఫోల్డర్ ఫీచర్ కూడా ఉంది. ఇక ఆండ్రాయిడ్ గో 10 యాప్స్ కన్నా ఆండ్రాయిడ్ గో 11 యాప్స్ 20 శాతం వేగంగా పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Samsung, Samsung Galaxy, Smartphone

    తదుపరి వార్తలు