Home /News /technology /

SAMSUNG GALAXY A SERIES PHONES INTO THE MARKET PRICE FEATURES DETAILS GH EVK

Samsung: మార్కెట్​లోకి శామ్​సంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్లు.. ధర, ఫీచర్ల వివ‌రాలు..

ప్రతీకాత్మక చిత్రం (image: Samsung India)

ప్రతీకాత్మక చిత్రం (image: Samsung India)

Samsung Mobile | దక్షిణ కొరియాకు చెందిన మొబైల్​ దిగ్గజం శామ్​సంగ్​ తన గెలాక్సీ A సిరీస్‌ నుంచి మరో రెండు ఫోన్లను నేడు (మార్చి 29)న విడుదల చేయనుంది. నేడు జరగబోయే శామ్​సంగ్ ఆన్​లైన్​ ఈవెంట్​లో గెలాక్సీ A సిరీస్​ నుంచి గెలాక్సీ ఎ73, గెలాక్సీ ఎ33 ఫోన్లను ఆవిష్కరించనుంది.

ఇంకా చదవండి ...
దక్షిణ కొరియా (South Korea) కు చెందిన మొబైల్​ దిగ్గజం శామ్​సంగ్ (Samsung)​ తన గెలాక్సీ A సిరీస్‌ నుంచి మరో రెండు ఫోన్లను నేడు (మార్చి 29)న విడుదల చేయనుంది. నేడు జరగబోయే శామ్​సంగ్ ఆన్​లైన్​ ఈవెంట్​లో గెలాక్సీ A సిరీస్​ నుంచి గెలాక్సీ ఎ73, గెలాక్సీ ఎ33 ఫోన్లను ఆవిష్కరించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్​ను శామ్​సంగ్​ ఇండియా అధికారిక సోషల్ మీడియా (Social Media) ఛానెల్‌లలో లైవ్​లో చూడవచ్చు. శామ్​సంగ్​ న్యూస్​రూమ్​ ఇండియా ట్విట్టర్ (Twitter), శామ్​సంగ్​ యూట్యూబ్​ ఛానెల్, శామ్​సంగ్ ఇండియా ఫేస్​బుక్​, శామ్​సంగ్ ఇండియా ట్విట్టర్​ ఛానళ్ల ద్వారా ఈవెంట్​ను వీక్షించవచ్చు.

WhatsApp: మార్చి 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్.. కస్టమర్లు వేరే డివైజ్‌లకు మారాల్సిందే..

ఈ ఈవెంట్​లోనే గెలాక్సీ ఎ73, గెలాక్సీ ఎ33 ఫోన్లకు సంబంధించిన ధర, ఫీచర్లను ప్రకటించనుంది. మార్చి 29న కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ (Hyderabad), చెన్నై నగరాల్లో, మార్చి 30న జైపూర్, పూణె (Pune), లక్నో, అహ్మదాబాద్‌ నగరాల్లో శామ్​సంగ్​ లాంచ్ ఈవెంట్లను నిర్వహించనుంది. శామ్​సంగ్​ ఈ నెల ప్రారంభంలో గెలాక్సీ A53 స్మార్ట్​ఫోన్ (Smart Phone) ​ను లాంచ్​ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, నెల రోజుల్లోనే మరో రెండు ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.

Crypto Malwares: క్రిప్టో యాప్స్‌లో మరో కొత్త మాల్వేర్.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

శామ్​సంగ్ గెలాక్సీ A73 5జీ ఫీచర్లు

శామ్​సంగ్ గెలాక్సీ A73 5G 6.7 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్‌స్టర్ సూచించింది. ఇది క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 750G SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ గల 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇక, కెమెరా (Camera) విషయానికి వస్తే.. 108- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12- మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8 -మెగాపిక్సెల్ టెర్షరీ కెమెరా, 2 -మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్​12 -ఆధారిత వన్​ UI 3 పై రన్​ అవుతుంది. ఇది కూడా గెలాక్సీ A53 5G మాదిరిగానే నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్​ OS (Android OS) అప్‌డేట్‌లకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

Amazon: ఇయ‌ర్ ఫోన్‌ల‌పై భారీ డిస్కౌంట్‌.. అమెజాన్ మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ ప్రారంభం..

శామ్‌సంగ్ గెలాక్సీ A33 5జీ ఫీచర్లు

Appauls నివేదిక ప్రకారం, శామ్​సంగ్​ గెలాక్సీ A33 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​ గల 6.4 -అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్​ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది శామ్​సంగ్​ ఎక్సినోస్​1280 చిప్‌సెట్​పై పనిచేస్తుంది. 25W ఛార్జింగ్‌కు మద్దతు గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, హెడ్‌లైన్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

దీని వెనుక భాగంలో 8- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 -మెగాపిక్సెల్ లెన్స్ కెమెరాలను అందించనుంది. అయితే, వీటి ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను శామ్​సంగ్ ఇంకా​ అధికారికంగా వెల్లడించలేదు.
Published by:Sharath Chandra
First published:

Tags: New smart phone, Samsung, Samsung Galaxy, Smart phones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు