SAMSUNG FEATURE PHONES BAD NEWS FOR MOBILE LOVERS SAMSUNG IS STOPPING THE SALE OF LOW PRICED FEATURE PHONES GH VB
Samsung Mobile: మొబైల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ ఫోన్‌ల అమ్మకాలను నిలిపేస్తున్న శాంసంగ్..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఫోన్లు చాలామంది భారతీయులకు ఫేవరెట్‌గా మారాయి. అయితే ఈ కంపెనీ ఇకపై తక్కువ ధర గల ఫీచర్ ఫోన్‌ల(Feature Phones) అమ్మకాలను ఇండియా (India)లో నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తయారు చేస్తున్న ఫోన్లు చాలామంది భారతీయులకు ఫేవరెట్‌గా మారాయి. రూ.1,500 ఖరీదైన బేసిక్ ఫోన్‌ల నుంచి రూ.లక్ష వరకు విలువైన ప్రీమియం ఫోన్ల వరకు చాలా మొబైల్స్‌ను ఇండియన్ యూజర్లకు శాంసంగ్ పరిచయం చేసింది. అయితే ఈ కంపెనీ ఇకపై తక్కువ ధర గల ఫీచర్ ఫోన్‌ల(Feature Phones) అమ్మకాలను ఇండియా (India)లో నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. శాంసంగ్ భారత్‌లో ఫీచర్ ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, శాంసంగ్ చివరి బ్యాచ్ ఫీచర్ ఫోన్‌లను డిక్సన్ (Dixon) ఈ సంవత్సరం డిసెంబర్‌లో తయారు చేయనుంది.
ఆ తరువాత, కంపెనీ భారత్‌లో ఫీచర్ ఫోన్లను తయారు చేయదు.
ఫీచర్ ఫోన్‌ల తయారీ, అమ్మకాలు నిలిపేసి శాంసంగ్ తన దృష్టిని హై-ఎండ్ మొబైల్స్ వైపు మళ్లించనుందని తెలుస్తోంది. శాంసంగ్ కంపెనీ ఇండియాలో ఎక్కువగా రూ.15,000, అంతకన్నా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని ఒక అధికారి తెలిపారు. అయితే ఫీచర్ ఫోన్ అమ్మకాలను ఆపాలని నిర్ణయించడానికి ప్రధాన కారణం అవి ఎక్కువగా ఖర్చు కాకపోవడమే నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో భారత్‌లో ఫీచర్ ఫోన్లు కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2022 మొదటి త్రైమాసికంలో మార్కెట్ సంవత్సరానికి 39 శాతం క్షీణత నమోదైంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఫీచర్ ఫోన్‌ల మార్కెట్‌లో టాప్ ప్లేసులో ఉన్న శాంసంగ్ ఇప్పుడు ఐటల్, లవా కంటే వెనుకబడింది.
22 శాతం మార్కెట్ షేర్
మార్చి చివరి వరకు శాంసంగ్‌కు బేసిక్ ఫోన్ సెగ్మెంట్ విలువలో కేవలం 1 శాతం, వాల్యూమ్‌లలో 20 శాతం మాత్రమే అందించిందని నివేదిక పేర్కొంది. Q1 2022లో, శాంసంగ్ 22 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్‌తో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ బ్రాండ్‌గా నిలిచింది. షియోమీని సైతం వెనక్కి నెట్టిన శాంసంగ్ ఆండ్రాయిడ్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. Q2 2022లో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని శాంసంగ్ ఎగ్జిక్యూటివ్‌లు ధీమా వ్యక్తం చేసినట్టు రిపోర్ట్ వెల్లడించింది.
తక్కువ ధర గల ఫోన్స్ విక్రయించకూడదని శాంసంగ్ నిర్ణయించుకోవడానికి మరో కారణం ఉంది. భారత ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం రూ.15,000 (ఫ్యాక్టరీ ధర) కంటే ఎక్కువ ఖరీదు చేసే ఫోన్‌ల తయారీకి మాత్రమే సోప్ (Sops)లను అందిస్తుంది. అంతకన్నా తక్కువ ధర గల హ్యాండ్‌సెట్‌లను తయారు చేస్తే ఎటువంటి రాయితీ లభించదు. ఇండియాలో రూ.15 వేల కంటే ఎక్కువ ఖరీదైన ఫోన్‌లను మాత్రమే తయారు చేయడానికే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ కారణంగా శాంసంగ్ ఇండియాలో ఫీచర్ ఫోన్లను తయారు చేయకూడదని, విక్రయించ కూడదని నిర్ణయించినట్లు సమాచారం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.