Home /News /technology /

SAMSUNG FAB GRAB SALE BIG OFFERS AND DISCOUNTS ON TV SMARTPHONES ACS CHECK ALL OFFERS HERE BA GH

Fab Grab Sale: శామ్‌సంగ్‌ ఫ్యాబ్ గ్రాబ్ సేల్ ఆరంభం .. టీవీ, స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌, ఏసీ, ఇంకా భారీ డిస్కౌంట్లు..

Samsung Fab Grab Sale

Samsung Fab Grab Sale

Samsung Fab Grab Sale best offers | శామ్‌సంగ్‌ కంపెనీ ఫ్యాబ్ గ్రాబ్ సేల్‌తో ఈ వేసవిలో సందడి చేస్తోంది. శామ్‌సంగ్‌ ఆకట్టుకునే ప్రొడక్ట్స్, క్వాలిటీ, లేటెస్ట్ టెక్నాలజీకి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు హాటెస్ట్ డీల్స్‌ను వినియోగదారులకు అందిస్తోంది.

ఇంకా చదవండి ...
శామ్‌సంగ్‌ కంపెనీ ఫ్యాబ్ గ్రాబ్ సేల్‌తో ఈ వేసవిలో సందడి చేస్తోంది. శామ్‌సంగ్‌ ఆకట్టుకునే ప్రొడక్ట్స్, క్వాలిటీ, లేటెస్ట్ టెక్నాలజీకి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు హాటెస్ట్ డీల్స్‌ను వినియోగదారులకు అందిస్తోంది. శామ్‌సంగ్‌ ఫ్యాబ్ గ్రాబ్ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ACలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. సేల్ మే 1న ప్రారంభమైంది.

ఫ్యాబ్ గ్రాబ్ సేల్ సమయంలో సాటిలేని ధరలు Samsung.comలో అందుబాటులో ఉంటాయి. ఇష్టమైన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న వస్తువును మార్చుకోవాలని అనిపిస్తే.. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి 18 నెలల వరకు నో కాస్ట్ EMI, 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ ఉంది. శామ్‌సంగ్‌ షాప్ యాప్‌ని ఉపయోగించి ఫ్యాబ్ గ్రాబ్ సేల్ సమయంలో ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే, రూ.4500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు Samsung smartphone offers and discounts
కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే.. ఇదే సరైన సమయం. అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Galaxy S20 FE 5G అత్యుత్తమ ధరకు అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం బెస్ట్ సెల్లర్ Galaxy S22, S22+ కూడా సేల్‌లో భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ. 72,999. HDFC బ్యాంక్ కార్డ్‌లతో తక్షణ క్యాష్‌బ్యాక్ రూ.5,000 పొందవచ్చు, లేదా అప్‌గ్రేడ్ బోనస్ రూ.8000 లభిస్తుంది. రూ. 11,999 విలువైన Galaxy Buds2ని కూడా రూ.2,999కి సొంతం చేసుకోవచ్చు. Galaxy M53 5G స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్‌ ధర రూ.22,999గా ఉంది. ICICI కార్డ్‌లపై రూ.2,500 తక్షణ క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ట్రావెల్ అడాప్టర్ (25W) ఉచితం. శామ్‌సంగ్‌ షాప్ యాప్ కొనుగోలుపై అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. Galaxy M33, Galaxy F23 వంటి హాట్‌షాట్‌లు ఉచిత ట్రావెల్ అడాప్టర్ (25W) ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. Galaxy M32, Galaxy F22 తక్కువ ధరకు లభిస్తున్నాయి.

ట్యాబ్‌లను ఇలా పొందండి (Offers on Samsung tabs)
శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్6 లైట్ వైఫై ట్యాబ్‌ను రూ.22,999కి దక్కించుకోవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్‌లపై ధర రూ.3000 తక్షణ తగ్గింపు పొందుతారు. శామ్‌సంగ్‌ షాప్ యాప్ కొనుగోలుపై రూ.1000 తగ్గింపు ఉంది. Galaxy Tab A8ని రూ.15,499కి కొనుగోలు చేయవచ్చు.

ల్యాప్‌టాప్‌లపై అసాధారణమైన ఆఫర్‌లు (Offers on Samsung laptops)
కొత్త Galaxy Book2 Pro 360 ప్రీమియం ల్యాప్‌టాప్‌ ధరను Samsung తగ్గించింది. ఇప్పుడు కొత్త Galaxy Book2 Pro 360 ధర రూ.122,990గా ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. రూ.11999 విలువైన Galaxy Buds2ని రూ.999కి పొందుతారు. శామ్‌సంగ్‌ షాప్ యాప్ నుండి కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.

* వేరబుల్ ప్రొడక్ట్స్‌పై..
స్మార్ట్‌ఫోన్‌కు సరైన జోడి స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు. ఇవి అద్భుతమైన ఆఫర్‌లలో అందుబాటులో ఉన్నాయి. Galaxy Buds Pro ధర రూ.6,641, మైటీ గెలాక్సీ వాచ్ 4 ధర రూ.13,491గా ఉన్నాయి.

బెస్ట్ సెల్లర్ Samsung Crystal 4K UHDపై బెస్ట్ డీల్
Samsung నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో క్రిస్టల్ 4K UHD TV ఒకటి. ఈ టెలివిజన్ దేశవ్యాప్తంగా ఆకట్టుకొంది. ఇప్పుడు రూ.31,740కి అందుబాటులో ఉంది. శామ్‌సంగ్‌ షాప్ యాప్‌పై రూ.4,500 వరకు తగ్గింపు, HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.6,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. EMI ఆప్షన్‌ను ఎంచుకుంటే 18 నెలల వరకు నో కాస్ట్ EMI పొందుతారు.

సాటిలేని ధరలకు శామ్‌సంగ్‌ ACలు (Offers on Samsung ACs)
సరికొత్త WindFree స్ప్లిట్ AC సేల్ సమయంలో తాజా ఆఫర్ ధర రూ.34,523కి దక్కుతుంది. HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా శామ్‌సంగ్‌ షాప్‌ యాప్‌లో కొనుగోలు చేస్తే రూ.2,250 తగ్గింపు పొందుతారు.

డిజి టచ్ కూల్ రిఫ్రిజిరేటర్‌.. (Samsung fridge offers)
డిజి టచ్ కూల్ రిఫ్రిజిరేటర్‌ రూ.14,670కి లభిస్తున్నాయి. HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,500 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 12 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

ట్విన్ కూలింగ్ ప్లస్‌తో శామ్‌సంగ్‌ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (Samsung fridge offers)
ఈ రిఫ్రిజిరేటర్ రూ.27,940కి సేల్‌లో లభిస్తుంది. HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.7,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందుతారు. శామ్‌సంగ్‌ షాప్ యాప్‌లో రూ.4,500 వరకు తగ్గింపు పొందుతారు. 18 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది.

అత్యుత్తమ ధరలో AI Ecobubble వాషింగ్ మెషిన్
అత్యుత్తమ ధరలో Samsung AI Ecobubble వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉంది. సేల్‌లో రూ.35,530కి సొంతం చేసుకోవచ్చు. HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై 15 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Samsung

తదుపరి వార్తలు