చైనా 5G టెక్నాలజీకి చెక్....6G టెక్నాలజీ దిశగా Samsung అడుగులు...

చైనా 5 జి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంటే, దాని ప్రయత్నాలకు గండి కొడుతూ సౌత్ కొరియా టెక్నాలజీ జెయింట్ Samsung Electronics ఇప్పుడు 6 జి కోసం సిద్ధమవుతోంది.

news18-telugu
Updated: July 14, 2020, 8:12 PM IST
చైనా 5G టెక్నాలజీకి చెక్....6G టెక్నాలజీ దిశగా Samsung అడుగులు...
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఓ వైపు చైనా 5 జి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంటే, దాని ప్రయత్నాలకు గండి కొడుతూ సౌత్ కొరియా టెక్నాలజీ జెయింట్ Samsung Electronics ఇప్పుడు 6 జి కోసం సిద్ధమవుతోంది. 2028 నాటికి 6 జి కమర్షియల్ గా మార్కెట్లోకి వస్తుందని Samsung Electronics ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కాగా 2030 నాటికి 6 జి నెట్‌వర్క్ మెయిన్ స్ట్రీమ్ లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై సంస్థ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శ్వేతపత్రం ద్వారా సంస్థ తన 6 జి ఐడియాను బయటపెట్టింది. ఈ పేపర్‌కు కంపెనీ 'ది నెక్స్ట్ హైపర్ కనెక్టెడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఆల్' అని పేరు పెట్టారు. వైట్ పేపర్ లో సంస్థ సాంకేతిక , సామాజిక మెగాట్రెండ్స్, కొత్త సేవలు, అవసరాలు మరియు సేవల గురించి వివరించింది.

అయితే అటు 5 జి నెట్‌వర్క్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని శామ్‌సంగ్ తెలిపింది. అటువంటి పరిస్థితిలో, కాగా ఇప్పటి నుండి 6 జి నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడం మంచి దశ అని కంపెనీ తెలిపింది, నిజానికి నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఒక దశాబ్దం పడుతుందని, అటువంటి పరిస్థితిలో, 6 జి నెట్‌వర్క్ తయారీ ఇప్పటి నుంచీ ప్రారంభిస్తే, ఈ నెట్‌వర్క్‌ను నిర్ణీత సమయంలోనే అభివృద్ధి చేయవచ్చని అందులో తెలిపింది.

అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ హెడ్ సున్ఘ్యూన్ చోయి మాట్లాడుతూ, 6 జి నెట్‌వర్క్ కోసం కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ దశలో కంపెనీ అవసరమైన అన్ని పరిణామాలపై కృషి చేస్తోందని అన్నారు.

6 జి 5 జి నెట్‌వర్క్ కంటే 10 రెట్లు వేగం...
6 జి నెట్‌వర్క్ ప్రమాణాలను నిర్దేశించడానికి, జపాన్ సన్నద్ధమవుతున్నట్లు గతంలో నిక్కీలో ఓ నివేదిక ద్వారా బయటకు వచ్చింది. నిక్కీ నివేదిక ప్రకారం, జపాన్ 6 జి నెట్‌వర్క్ గురించి వివరించింది. అయితే, 5 జి నెట్‌వర్క్ టెక్నాలజీలో జపాన్ ప్రపంచంలోని అనేక దేశాల కంటే ఇంకా వెనుకబడి ఉంది. కానీ జపాన్ మాత్రం 6 జి నెట్‌వర్క్ ప్రస్తుత 5 జి కంటే 10 రెట్లు వేగంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం, ప్రపంచంలోని చాలా దేశాలు 5 జిని అభివృద్ధి చేస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: July 14, 2020, 8:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading