హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Slidable Displays: శామ్‌సంగ్ పీసీలకు స్లైడబుల్ డిస్‌ప్లేలు.. త్వరలో యూజర్లకు రిలీజ్.. వివరాలివే..

Slidable Displays: శామ్‌సంగ్ పీసీలకు స్లైడబుల్ డిస్‌ప్లేలు.. త్వరలో యూజర్లకు రిలీజ్.. వివరాలివే..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Slidable Displays: ఇంటెల్ ఇన్నోవేషన్ కీనోట్ (Intel Innovation Keynote) ఈవెంట్‌లో శామ్‌సంగ్‌ సంస్థ తన పీసీల కోసం '17-అంగుళాల స్లైడబుల్ డిస్‌ప్లే'ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఈ డిస్‌ప్లే ఎలా పనిచేస్తుందో ఒక ప్రోటోటైప్‌ ద్వారా చూపించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఒకప్పుడు మడతబెట్టే ఫోన్లు తీసుకొస్తామని టెక్ కంపెనీలు ప్రకటిస్తే.. అదంతా అబద్ధమని అందరూ అనుకున్నారు. కానీ శామ్‌సంగ్‌ (Samsung) లాంటి కంపెనీలు దానిని నిజం చేసి చూపించాయి. అయితే ఇప్పుడు స్లైడబుల్ పీసీ డిస్‌ప్లే (Slidable Displays)లను తీసుకొస్తున్నట్లు శామ్‌సంగ్‌ ప్రకటించింది. 2022 ఇంటెల్ ఇన్నోవేషన్ కీనోట్ (Intel Innovation Keynote) ఈవెంట్‌లో శామ్‌సంగ్‌ సంస్థ తన పీసీల కోసం '17-అంగుళాల స్లైడబుల్ డిస్‌ప్లే'ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఈ డిస్‌ప్లే ఎలా పనిచేస్తుందో ఒక ప్రోటోటైప్‌ ద్వారా చూపించింది. ఈ ప్రదర్శనలో శామ్‌సంగ్‌ డిస్‌ప్లే (Samsung Display) సీఈఓ JS చోయ్ 17-అంగుళాల డిస్‌ప్లేను అడ్డంగా అటూ ఇటూ స్లైడ్‌ చేస్తూ చూపించారు. ఇది చూసేందుకు అద్భుతంగా అనిపించింది.

JS చోయ్ ఆన్-స్టేజ్ డెమో ద్వారా చూపించిన పీసీ స్లైడబుల్ స్క్రీన్ సూపర్‌గా వర్క్ అయ్యింది. ఈ డిస్‌ప్లేను త్వరలో ప్రజలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. OLED డిస్‌ప్లేతో వచ్చే ఈ పీసీల కమర్షియల్ ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇంటెల్ ఈవెంట్‌లో దీనిని ప్రదర్శించారు కాబట్టి ఇది కొత్త యునిసన్ సాఫ్ట్‌వేర్‌తో రన్‌ అవచ్చు.

నిజానికి ట్యాబ్లెట్ లాగా కనిపించే ఈ పీసీ డిస్‌ప్లే 13-అంగుళాల పొడవుంది. దీనిని అడ్డంగా 17 అంగుళాలకు పొడిగించేలా ఫ్లైట్ డిస్‌ప్లే అందించారు. ఈ వర్కింగ్ ప్రోటోటైప్‌పై ఒకే స్టాటిక్ ఇమేజ్ అనిపించింది. JS చోయ్ చెప్పిన దాని ప్రకారం, ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 వంటి ట్యాబ్లెట్ లాంటి ఫారమ్ ఫ్యాక్టర్‌తో ప్రత్యేకంగా తయారు చేశారు.

కాగా దీని డిస్‌ప్లే ప్యానెల్ రిజల్యూషన్, యాస్పెక్ట్ రేషియో, బ్రైట్‌నెస్, ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా తెలియ రాలేదు కాబట్టి ఇది ఎంత కాలం మన్నికగా ఉంటుందో నిర్ధారించడం కష్టం. స్లైడబుల్ డిస్‌ప్లే క్వాలిటీ తెలియకపోయినా డిజైన్ అదిరిపోయిందని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాబ్లెట్-ఎస్క్యూ (Tablet-esque) డిజైన్‌లను దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్‌ల కోసం ఈ స్లైడబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు చోయ్ తెలిపారు. ఈ టెక్నాలజీని శామ్‌సంగ్‌, ఇంటెల్ వంటి కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి.

* ఫోల్డబుల్ డివైజ్‌లపై ఫోకస్

శామ్‌సంగ్‌ కొన్ని సంవత్సరాలుగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఎదురులేని సంస్థగా ఇది కొనసాగుతోంది. అయితే, కంపెనీ భవిష్యత్తులో ఫోల్డబుల్ డివైజ్‌ల కోసం స్లైడబుల్ డిస్‌ప్లేలతో సహా చాలా సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయనుందని తెలుస్తోంది. స్క్రీన్‌లను ఎక్స్‌పాండ్ చేసే కాన్సెప్ట్‌ను LG తన రోలబుల్ టీవీలలో ఆల్రెడీ పరిచయం చేసింది. ఈ డిస్‌ప్లే టీవీ స్టాండ్‌లోకి ముందుకు వెనుకకు వంకరగా కదులుతుంది. ఇందులో OLED ప్యానెల్‌ ఆఫర్ చేశారు. ఈ టీవీలు భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Samsung, Tech news

ఉత్తమ కథలు