సాంసంగ్ స్మార్ట్ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ధర తగ్గింది. ఈ ఫోన్ గత నెలలోనే ఇండియాలో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. నెలరోజుల్లోనే ఈ ఫోన్ ధరను తగ్గించింది కంపెనీ. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజైంది. కానీ కేవలం 6జీబీ వేరియంట్ ధర మాత్రమే తగ్గింది. రిలీజ్ అయినప్పుడు 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.18,499 కాగా ధర రూ.1,000 తగ్గింది. అంటే సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.17,499 మాత్రమే. ఇక 4జీబీ+64జీబీ ధరలో ఎలాంటి మార్పు లేదు. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ విశేషాలు చూస్తే ఇన్ఫినిటీ ఓ హోల్ పంచ్ డిస్ప్లే, క్వాడ్ కెమెరా, ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.