హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్
(ప్రతీకాత్మక చిత్రం)

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్ (ప్రతీకాత్మక చిత్రం)

Samsung Smartphone | స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గిస్తోంది సాంసంగ్. ఇప్పటికే మూడు ఫోన్ల ధరల్ని తగ్గించింది. ఇందులో రెండు లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి.

సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని సాంసంగ్ తగ్గించింది. సాంసంగ్ గెలాక్సీ ఎం01, సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ మోడల్స్‌పై ధర తగ్గించింది. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ఏ31 మోడల్ ధర తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎం01, సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ధరను రూ.500 తగ్గించింది కంపెనీ. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో తగ్గింపు ధరలకే ఈ ఫోన్లను కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 నుంచి రూ.7,499 ధరకు తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ధర రూ.9,499 నుంచి నుంచి 8,999 ధరకు తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ ఏ31 ధర రూ.2,000 తగ్గింది. ప్రస్తుత ధర రూ.17,999.

Happy New Year 2021: వాట్సప్‌లో న్యూ ఇయర్ విషెస్ ఇలా కూడా చెప్పొచ్చు

Jio New Year Gift: యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన జియో... ఏంటో తెలుసుకోండి

సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5.71 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే

ర్యామ్: 3జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439

రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4000ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

కలర్స్: బ్లాక్, బ్లూ, రెడ్

ధర:

3జీబీ+32జీబీ- రూ.7,499

Xiaomi Mi 10i: కొత్త ఫోన్ కొనాలా? ఓ 5 రోజులు ఆగండి... ఎంఐ 10ఐ వచ్చేస్తోంది

WhatsApp: అలర్ట్... ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... మీ దగ్గర ఈ మోడల్ ఉందా?

సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే

ర్యామ్: 3జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22

రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4000ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

కలర్స్: బ్లాక్, బ్లూ, రెడ్

ధర:

3జీబీ+32జీబీ- రూ.8,999

సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్+, గెలాక్సీ బడ్స్ లైవ్ ధరల్ని కూడా తగ్గించింది కంపెనీ. ధర ఏకంగా రూ.3,000 తగ్గింది. దీంతో గెలాక్సీ బడ్స్+ ధర రూ.11,990 నుంచి రూ.8,990 వరకు తగ్గింది. ఇక గెలాక్సీ బడ్స్ లైవ్ ధర రూ.14,990 నుంచి రూ.11,990 ధరకు చేరుకుంది.

First published:

Tags: Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones