Home /News /technology /

SAMSUNG BUDGET 5G SMARTPHONE WITH 8GB OF RAM BECOMES MUCH CHEAPER WILL GET 64 MEGAPIXEL CAMERA MK

Samsung Galaxy M52 5G: Samsung Galaxy M52 ధరలు భారీగా తగ్గించేశారు...ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ తింటారు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Samsung Galaxy M52 5G ధరలు భారీగా తగ్గించేశారు. ముఖ్యంగా కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ వారం భారీగా తగ్గంది. ఈ 5G ఫోన్ సెప్టెంబర్ 2021లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

    Samsung Galaxy M52 5G ధరలు భారీగా తగ్గించేశారు. ముఖ్యంగా కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ వారం భారీగా తగ్గంది. ఈ 5G  ఫోన్ సెప్టెంబర్ 2021లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. తాజాగా ఈ ఫోన్ ధరను రూ. 2,500 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 27,499 , 8GB + 128GB వేరియంట్ ధర రూ. 29,499 పలుకుతోంది. ఈ ఫోన్ Qualcomm ప్రాసెసర్ , Android 11 సిస్టమ్ తో పని చేస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను బ్లేజింగ్ బ్లూ , ఐసి బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ Xiaomi Mi 11 Lite NE 5G, Realme X7 Pro 5Gలతో పోటిపడుతోంది. ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దాని ట్రిపుల్ కెమెరా, 120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే , 25W ఛార్జింగ్ సపోర్ట్. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    Samsung Galaxy M52 5G 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే లభిస్తోంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని రిజల్యూషన్ 1080×2 400 పిక్సెల్స్. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB వరకు RAM ఇందులో పొందవచ్చు. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ బ్లేజింగ్ బ్లాక్ , ఐసీ బ్లూ అనే రెండు రంగులలో వస్తుంది.

    64 మెగాపిక్సెల్ కెమెరా దీని ప్రత్యేకత...

    ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ , 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

    పవర్ కోసం, Samsung Galaxy M52 5G 5000mAh బ్యాటరీని ఇందులో గమనించవచ్చు.  25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇది 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్, GPS, SFC , USB టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Samsung, Samsung Galaxy

    తదుపరి వార్తలు