హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Mouse: సాంసంగ్ నుంచి కొత్త మౌస్... మీరు ఎక్కువసేపు పనిచేస్తే పారిపోతుంది

Samsung Mouse: సాంసంగ్ నుంచి కొత్త మౌస్... మీరు ఎక్కువసేపు పనిచేస్తే పారిపోతుంది

Samsung Mouse: సాంసంగ్ నుంచి కొత్త మౌస్... మీరు ఎక్కువసేపు పనిచేస్తే పారిపోతుంది

Samsung Mouse: సాంసంగ్ నుంచి కొత్త మౌస్... మీరు ఎక్కువసేపు పనిచేస్తే పారిపోతుంది

Samsung Mouse | ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు, టెక్నాలజీ సృష్టిస్తున్న సమస్యలకు టెక్నాలజీతోనే పరిష్కారాలు కనిపెడుతున్నాయి కంపెనీలు. అందులో భాగంగానే సాంసంగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ (Work Life Balance) కోసం ఓ కొత్త మౌస్ తయారుచేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ (Work Life Balance) గురించి లైఫ్ కోచ్‌లు గంటలు గంటలు స్పీచ్‌లు ఇస్తుంటారు. ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెబుతుంటారు. గంటలుగంటలు ఆఫీసు పనిలోనే ఉండకుండా జీవితంలో చేయాల్సిన ఇతర పనుల గురించి, కుటుంబం గురించి ఆలోచించాలని సూచిస్తుంటారు. ఉద్యోగులకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ పెద్ద సవాల్. ఈ సమస్యకు పరిష్కారం చెప్పేందుకే దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీ సాంసంగ్ (Samsung) ఓ కొత్త మౌస్‌ను తయారు చేసింది. ఈ మౌస్‌తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమని చెబుతోంది. మౌస్‌తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సాధ్యం అన్న డౌట్ మీకూ ఉందా? ఈ మౌస్ గురించి తెలుసుకోండి.

సాంసంగ్ బ్యాలెన్స్ 3 పేరుతో ఈ మౌస్‌ను తయారు చేసింది సాంసంగ్ . పేరులో ఉన్నట్టుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎంతసేపు పనిచేయాలన్నది మీ ఇష్టం కాదు. ఆ మౌస్ ఇష్టం. మీరు ఎక్కువ పనిచేస్తానన్నా ఆ మౌస్ ఊరుకోదు. అక్కడ్నుంచి పారిపోతుంది. అవును. మీరు మౌస్ పట్టుకొని మీ సమయానికి మించి పనిచేయాలన్నా సాధ్యం కాదు. సమయం దాటిపోయిన తర్వాత మౌస్ మీకు సహకరించదు.

Big Billion Offer: ఈ పాపులర్ మొబైల్‌పై రూ.6,000 డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్

కంప్యూటర్ పనిచేయాలంటే మౌస్ చాలా ముఖ్యమైన డివైజ్. మౌస్ లేకుండా పనిచేయలేరు. అందుకే కొత్తగా ఈ మౌస్‌ను తయారు చేసింది సాంసంగ్. గంటలుగంటలు ఆఫీసులో కూర్చొని పనిచేసేవారికి ఈ మౌస్ బాగా ఉపయోగపడుతుంది. ఆఫీస్ టైమ్ అయిపోగానే ఈ మౌస్ పనిచేయదు. మీరు మౌస్ పట్టుకోవాలని చూసినా పారిపోతూ ఉంటుంది. ఈ వీడియో చూస్తే మౌస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.

Samsung Price Cut: సాంసంగ్ సర్‌ప్రైజ్... ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింపు

సాంసంగ్ బ్యాలెన్స్ ల్యాబ్ రూపొందించిన మౌస్ ఇది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఈ మౌస్‌ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. తాము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నామని అనుకునేవారు ఈ మౌస్ కొనొచ్చు. అయితే ముఖ్యంగా దక్షిణ కొరియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన మౌస్ ఇది. డిమాండ్ ఉంటే ఇతర మార్కెట్లలో కూడా రిలీజ్ చేయొచ్చు.

ప్రపంచంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు. పనితప్ప ఇతర ధ్యాస ఉండట్లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే జీవితంలో ఇతర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Samsung, South korea

ఉత్తమ కథలు