హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung: గెలాక్సీ A73 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను ప్రకటించిన శామ్‌సంగ్.. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, ఇతర వివరాలిలా..

Samsung: గెలాక్సీ A73 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను ప్రకటించిన శామ్‌సంగ్.. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, ఇతర వివరాలిలా..

శామ్‌సంగ్ కంపెనీ గత వారం సరికొత్త గెలాక్సీ A73 (Samsung Galaxy A73) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ డివైజ్ ధర రూ. 41,999 నుంచి ప్రారంభమవుతుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  శామ్‌సంగ్ కంపెనీ గత వారం సరికొత్త గెలాక్సీ A73 (Samsung Galaxy A73) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ డివైజ్(Device) ధర రూ. 41,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 44,999 వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఇప్పటికే దక్షిణ కొరియా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ వారంలోనే ఇవి ఇండియన్ మార్కెట్లోకి అమ్మకానికి రానున్నాయి. ధర ఎంతంటే.. భారతదేశంలో Samsung Galaxy A73 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే బేస్ మోడల్ ధర రూ.41,999. స్మార్ట్‌ఫోన్ టాప్-ఎండ్ మోడల్‌లో 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ మోడల్ ధర రూ. 44,999. ఈ ఫోన్ ఆసమ్ మింట్, ఆసమ్ గ్రే, ఆసమ్ వైట్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

  Bank Customers: ఆ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వాటిలో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి..

  సేల్స్ వివరాలు

  శామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 8 సాయంత్రం 6 గంటలకు Galaxy A73 సేల్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. కస్టమర్‌లు Samsung Finance+, SBI క్రెడిట్ కార్డ్‌లు, ICICI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా రూ. 3,000 అదనపు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. Galaxy A73 మోడల్‌ను ప్రీ బుకింగ్ చేసుకున్న వ్యక్తులు Galaxy Buds Liveను రూ. 499 వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 6,990గా ఉండగా స్మార్ట్‌ఫోన్ సేల్‌తో తక్కువకే లభించనుంది.

  * స్పెసిఫికేషన్లు

  గతంలో వచ్చిన Galaxy A72 కంటే A73 వేరియంట్‌లో కెమెరాల పరంగా కొన్ని అప్‌గ్రేడ్‌లను కంపెనీ తీసుకువస్తుంది. ఇది 1080×2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేతో రానుంది. ఇది 32-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్‌ను ప్యాక్ చేసే పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

  ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌ ఉంటుంది. తాజా గెలాక్సీ ఫోన్ Adreno 642L GPUతో జత చేసిన Qualcomm Snapdragon 778G చిప్‌సెట్ ద్వారా పరిచేస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని మరింత విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ OneUI 4.1 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌తో ఫోన్ రన్ అవుతుంది. గెలాక్సీ A73 ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AKG సౌండ్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, IP67 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్.. వంటి ఫీచర్లు దీని సొంతం.

  First published:

  ఉత్తమ కథలు