ఇండియన్ మార్కెట్లోకి సైలెంట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది సాంసంగ్. గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది సాంసంగ్. ఇన్ఫినిటీ వీ-డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెండు వేరియంట్లలో సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ లభిస్తుంది. 32 జీబీ స్టోరేజ్‌తో 2జీబీ, 3 జీబీ ర్యామ్ మోడల్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.9,499. ఆగస్ట్ 28 నుంచి అన్ని రీటైల్ స్టోర్లు, ఇ-షాప్, సాంసంగ్ ఒపెరా హౌజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.