Apple's iPhone 12: ఛార్జర్ వివాదంలో యాపిల్... సెటైర్లు వేస్తున్న శాంసంగ్, జియోమీ

Apple's iPhone 12: కరోనా సమయంలో కామ్ గా ఉన్న కంపెనీలు... ఇప్పుడు నువ్వా, నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ ఛార్జర్ వివాదమేంటి? యాపిల్ ఏం చేసింది?

news18-telugu
Updated: October 21, 2020, 7:34 AM IST
Apple's iPhone 12: ఛార్జర్ వివాదంలో యాపిల్... సెటైర్లు వేస్తున్న శాంసంగ్, జియోమీ
Apple's iPhone 12: ఛార్జర్ వివాదంలో యాపిల్... సెటైర్లు వేస్తున్న శాంసంగ్, జియోమీ
  • Share this:
ఈ సంవత్సరం యాపిల్ కంపెనీ ఓ ప్రత్యేక ప్రకటన చేసింది. ఏంటంటే... ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో మోడల్స్ తో... ఈసారి చార్జర్, ఇయర్ పాడ్స్ ఆఫర్ చెయ్యట్లేదని (ఇవ్వట్లేదని) తెలిపింది. యాపిల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం... వస్తువుల వృథాను అరికట్టడం కోసమే. అంటే... అవసరం లేకపోయినా ఇవ్వడం ఎందుకు అని యాపిల్ కంపెనీ భావించింది. కానీ సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. యాపిల్ కి గట్టి పోటీ ఇస్తున్న శాంసంగ్, జియోమీ కంపెనీలు... తమ హ్యాండ్ సెట్లలో వాటిని ఇస్తున్నప్పుడు యాపిల్ ఎందుకు ఇవ్వదు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఫోన్ కొనేటప్పుడు... కచ్చితంగా దానికి ఛార్జర్ ఉండాలనే కోరుకుంటారు గానీ... విడిగా ఛార్జర్ కొనుక్కుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

ఈమధ్య జియోమీ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో తన Mi 10T ప్రో స్మార్ట్ ఫోన్‌ను అన్ బాక్సింగ్ చేసింది. అందులో పవర్ ఎడాప్టర్ (ఛార్జర్) ఉంది. ఆ వీడియోపై యాపిల్ కి సెటైరికల్ గా ఓ క్యాప్షన్ పెట్టింది. "వర్రీ అవ్వకండి... మేము Mi10T ప్రోతో ఏదీ కట్ చెయ్యట్లేదు. అన్నీ ఇస్తున్నాం" అని రాసింది. ఇది యాపిల్ కి కౌంటర్ గానే అనుకోవచ్చు.




వారం కిందటి ట్వీటుకి 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 34వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది చాలదా యాపిల్ కి అని అడుగుతున్నారు చాలా మంది. యాపిల్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి అంటున్నారు. ఈ ట్వీట్ చూసి ఓ యూజర్... ఇలాంటి మార్కెటింగ్ కి 10/10 మార్కులు ఇస్తున్నాను అని రాశారు.

శాంసంగ్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. యాపిల్ కి కౌంటర్ ఇచ్చింది. శాంసంగ్ తన ఫేస్ బుక్ పోస్టులో... గెలాక్సీ ఫోన్లు చార్జర్ తో వస్తాయని తెలిపింది. తన పోస్టులో "మీ గెలాక్సీ మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇస్తుంది. ముఖ్యంగా అవసరమైన ఛార్జర్, బెస్ట్ కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మెన్స్, మెమరీ... అంతేకాదు... స్మార్ట్ ఫోన్ పై 120Hz స్క్రీన్ కూడా" అని క్యాప్షన్ పెట్టింది.



యాపిల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేలా కనిపించట్లేదు. ఎన్ని పోటీ కంపెనీలు ఉన్నా... తమ బ్రాండ్ కి ఉన్న వాల్యూయే వేరంటున్న యాపిల్... కచ్చితంగా తమ ప్రొడక్టే కొంటారంటోంది. అంతగా ఛార్జర్ కావాలనుకునేవారు విడిగి యాపిల్ ఛార్జర్ కొనుక్కుంటారే తప్ప... ఛార్జర్ కోసం వేరే కంపెనీల మోడల్స్ కొనుక్కోరనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఈ కంపెనీలు ఫోన్ల మోడల్స్ తో కాకుండా... ఛార్జర్లతో ప్రచారం చేసుకుంటున్నాయి.
Published by: Krishna Kumar N
First published: October 21, 2020, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading