స్మార్ట్‌ఫోన్ల ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీలు రిలీజ్ చేస్తుంటాయి. దీంతో స్మార్ట్‌ఫోన్స్ సేఫ్‌గా ఉండడంతో పాటు వాటి పనితీరు మెరుగుపడుతుంది. అయితే సెక్యూరిటీ అప్‌డేట్స్ ఎన్ని వచ్చినా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ పరంగా సమస్యలు తలెత్తుతుంటాయి. తాజాగా ఎక్సినోస్(Exynos) ప్రాసెసర్ వినియోగించిన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్స్, గూగుల్ పిక్సెల్ 6, 7 స్మార్ట్ ఫోన్స్‌లలో సెక్యూరిటీ రిస్క్ ఉన్నట్లు గూగుల్ ప్రొజెక్ట్ జీరో టీమ్ వెల్లడించింది. శామ్‌సంగ్ ఎక్సినోస్ స్మార్ట్‌వాచ్‌లు కూడా ఈ సమస్య వల్ల ప్రభావితం కానున్నట్లు సమాచారం. ఈ మేరకు గూగుల్ ప్రొజెక్ట్ జీరో టీమ్ కొన్ని టెస్ట్‌లు నిర్వహించి నాలుగు లోపాలను గుర్తించింది.
18 సెక్యూరిటీ రిస్క్‌ల గుర్తింపు
ఈ డివైజ్‌ల్లో ఎక్సినోస్ చిప్‌సెట్ కారణంగా Wi-Fi కాలింగ్, VoLTE ఫీచర్‌లో సెక్యూరిటీ రిస్క్ ఉన్నట్లు, వెంటనే వాటిని డిజేబుల్ చేయాలని గూగుల్ సెక్యూరిటీ టీమ్ సూచించింది. కాగా, గతేడాది చివరిలో అందుబాటులోకి వచ్చిన Exynos మోడెమ్‌లలో ఇప్పటివరకు 18 సెక్యూరిటీ సమస్యలను గూగుల్ ప్రొజెక్ట్ సెక్యూరిటీ టీమ్ గుర్తించింది. Exynos చిప్‌సెట్ ద్వారా పనిచేస్తున్న డివైజ్‌లతో వాటి యూజర్ల డేటా రిస్క్‌లో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
రిమోట్‌గా హ్యాక్ చేసే అవకాశం
దీనికి సంబంధించి ప్రాజెక్ట్ జీరో టీమ్ చేసిన పోస్ట్‌లో..‘మేం చేపట్టిన టెస్ట్‌ల్లో తాజాగా నాలుగు సెక్యూరిలీ లోపాలను గుర్తించాం. వీటి ద్వారా బేస్‌బ్యాండ్ స్థాయిలో యూజర్‌తో ఇంటరాక్షన్ లేకుండానే హ్యాకర్లు ఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసే అవకాశం ఉంది. అయితే ఇలా చేయడానికి ముందు బాధితుడి ఫోన్ నెంబర్‌ను హ్యాకర్లు తెలుసుకోవాల్సి ఉంటుంద’ని పేర్కొంది. నాలుగు సెక్యూరిటీ లోపాలను గుర్తించినా, వాటి వివరాలను గూగుల్ ప్రొజెక్ట్ జీరో టీమ్ వెల్లడించలేదు. ఎందుకంటే వాటి వివరాలను తెలపడం వల్ల హ్యాకర్లు యూజర్ల డేటాను హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సెక్యూరిటీ టీమ్ స్పష్టం చేసింది.
ఎక్సినోస్ చిప్‌సెట్ డివైజ్‌ల జాబితా
ఎక్సినోస్ 5123, 5300, 980, 1080 చిప్ సెట్లలో సెక్యూరిటీ సమస్య ఉన్నట్లు, వాటిని వినియోగించిన డివైజ్‌ల జాబితాను ప్రాజెక్ట్ జీరో టీమ్ వెల్లడించింది. ఈ జాబితాలో శామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్, వివొ స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఉన్నాయి. శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ S22, M33, M13, M12, A71, A53, A33, A21, A13, A12, A04 ఈ జాబితాలో ఉన్నాయి. గూగుల్ నుంచి పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6a, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ఉన్నాయి. వివో నుంచి వివో S16, S15, S6, X70, X60, X30 మోడల్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ఎక్సినోస్ W920 చిప్ సెట్‌తో రన్ అయ్యే స్మార్ట్ వాచ్ లు, ఎక్సినోస్ ఆటో T5123 చిప్‌సెట్ ఉపయోగించిన కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. సెక్యూరిటీ రిస్క్ కారణంగా ఈ డివైజ్‌లను ఉపయోగిస్తున్న యూజర్ల డేటా రిస్క్‌లో పడే అవకాశం ఉంది. కాగా, పిక్సెల్ 7, 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ప్రొటెక్షన్ కోసం గూగుల్ ఇటీవల సెక్యూరిటీ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. అయితే మిగతా మోడల్స్ ఇప్పటికీ రిస్క్‌లో ఉన్నాయని, దీంతో ఈ మోడల్స్ యూజర్లు తమ ఫోన్లలో Wi-Fi కాలింగ్, VoLTE సెట్టింగ్‌లను నిలిపివేయమని ప్రాజెక్ట్ జీరో టీమ్ సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, 5g technology, Samsung, Samsung Galaxy, Technology