ఇండియాలో అక్టోబర్ 1న 5G సేవలు (5G Services) అధికారికంగా లాంచ్ అయ్యాయి. తర్వాత జియో, ఎయిర్టెల్ టెలికాం కంపెనీలు ఈ నెట్వర్క్ను కొన్ని సర్కిళ్లలో ప్రారంభించాయి. పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని తెలిపాయి. అయితే ఇండియాలో 5G సేవలకు సపోర్ట్ చేసేలా కొన్ని మొబైల్ తయారీ సంస్థలు తమ ఫోన్లలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ అంశంలో శామ్సంగ్, యాపిల్ కంపెనీలు వెనకబడ్డాయి. గూగుల్ కూడా కొన్ని 5G స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ అందించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో వీలైనంత తర్వగా మొబైల్ కంపెనీలు తమ డివైజ్లను 5Gకి సపోర్ట్ చేసేలా అప్డేట్లు అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కొన్ని కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వం తాజాగా చర్చలు జరిపింది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు అందించే అంశంపై శామ్సంగ్, యాపిల్, గూగుల్ కంపెనీలు స్పందించాయి. ఆ వివరాలు చూద్దాం.
2022 నవంబర్ నాటికి తమ కంపెనీ లాంచ్ చేసిన అన్ని 5G స్మార్ట్ఫోన్లు OTA అప్డేట్ను పొందుతాయని శామ్సంగ్ (Samsung) ప్రకటించింది. శామ్సంగ్ ఇండియా ప్రతినిధి విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘శామ్సంగ్ 2009 నుంచి 5G టెక్నాలజీ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించింది. ప్రపంచవ్యాప్తంగా 5G టెక్నాలజీని స్టాండర్డైజింగ్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలో శామ్సంగ్ చాలా 5G ఫోన్లను లాంచ్ చేసింది. మేము మా ఆపరేటర్ భాగస్వాములతో సన్నిహితంగా పని చేస్తున్నాం. 2022 నవంబర్ మధ్య నాటికి మా 5G డివైజ్లు అన్నింటికీ OTA అప్డేట్లను అందజేస్తాం. ఈ అప్డేట్తో భారతీయ వినియోగదారులు 5G సేవలను వినియోగించుకోగలరు.’ అని చెప్పారు.
ప్రస్తుతం కేవలం 9 శామ్సంగ్ హ్యాండ్సెట్లు మాత్రమే ఎయిర్టెల్(Airtel) 5G సేవలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వివరాలను ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో పేర్కొంది. దీంతో ఇండియన్ 5జీ బ్యాండ్స్కు కంపాటబుల్గా శామ్సంగ్ తమ మోడళ్లను అప్డేట్ చేయనుంది.
Data Leak: అలర్ట్... ఎస్బీఐ సహా పలు సంస్థల డేటా లీక్... 90 లక్షల కస్టమర్ల డేటాకు రిస్క్
ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్లు ఏవీ 5Gకి సపోర్ట్ చేయడం లేదు. దీనికి సంబంధించి యాపిల్ కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో.. 2022 డిసెంబర్ నాటికి 5G సేవలను యాపిల్ వినియోగదారులు వినియోగించేలా అప్డేట్ను చేస్తామని పేర్కొంది. నెట్వర్క్ ధ్రువీకరణ, నాణ్యత, పనితీరు కోసం టెస్టింగ్ పూర్తయిన వెంటనే iPhone వినియోగదారులకు ఉత్తమ 5G అనుభవాన్ని అందించడానికి భారతదేశంలోని క్యారియర్ పార్ట్నర్స్తో కలిసి పని చేస్తున్నామని తెలిపింది. 5Gకి సపోర్ట్ చేసేలా డిసెంబర్లో అప్డేట్ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.
32 inch Smart TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.8,999 మాత్రమే... ఆఫర్ వివరాలివే
కొన్ని శామ్సంగ్ హ్యాండ్సెట్లతో పాటు రియల్మీ , వన్ప్లస్ , ఒప్పో , షియోమి, ఇతర చైనీస్ కంపెనీలు 5Gకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే గూగుల్ లాంచ్ చేసిన Pixel 7, 7 Pro 5G ఫోన్లు ప్రస్తుతం 5Gకి సపోర్ట్ చేయవు. Pixel 7, 7 Pro, Pixel 6a 5G సామర్థ్యం గల డివైజ్లు. వీలైనంత త్వరగా ఇండియాలో 5Gకి సపోర్ట్ చేసేలా అప్డేట్లను తీసుకొస్తామని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, 5G Smartphone, Airtel 5G Plus, Jio TRUE 5G, Samsung