ఆంగ్లో ఇండియన్ ఆంట్రప్రెన్యూర్ అయిన సేక్ డీన్ మహ్మద్‌కు గూగుల్ తన మార్క్ డూడుల్‌తో నివాళి అర్పించింది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య సాంస్కృతిక వారధిని నిర్మించేందుకు ఆంగ్లో ఇండియన్ ట్రావెలర్ సేక్ డీన్ మహ్మద్ కృషి చాలా గొప్పది. ఇంగ్లాండ్‌లో మహ్మద్ ప్రారంభించిన ఇండియన్ రెస్టారెంట్‌కు బ్రిటన్‌లో మంచి పేరు వచ్చింది. 1810లో లండన్ వెళ్లిన సేక్ డీన్ మహ్మద్ హిందొస్తానీ కేఫ్ హౌజ్ ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లో అదే తొలి భారతీయ రెస్టారెంట్. కొన్నేళ్ల తర్వాత ఆ లగ్జరీ హోటల్‌ను మూసెయ్యాల్సి వచ్చింది.
హోటల్ మూసేసిన తర్వాత కొత్త దారులు వెతుక్కోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత సేక్ డీన్ మహ్మద్స్ బాత్స్ పేరుతో స్పా ప్రారంభించారు. లగ్జరియస్ హర్బల్ స్టీమ్ బాత్ అందించే స్పాగా పేరొచ్చింది. భారతీయ చికిత్స మర్దన, స్టీమ్ బాత్ కలిపి అందించిన సేవలు బ్రిటన్వాసుల్ని ఆకట్టుకున్నాయి. హిందీ పదం అయిన చాంపిసాజ్ నుంచే షాంపూయింగ్ అనే చికిత్సను ప్రారంభించారు. "ది షాంపూయింగ్ సర్జన్ ఆఫ్ బ్రిగ్టన్"గా ఆయనకు పేరొచ్చింది. 1822లో కింగ్ జార్జ్ IV దగ్గర పర్సనల్ షాంపూయింగ్ సర్జన్‌గా పనిచేశారు. ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టన్ మ్యూజియంలో ఆయన చిత్రపటం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి
Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్
Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499
Jio Effect: వొడాఫోన్ రూ.396 కొత్త ప్లాన్... 69 రోజులు అన్లిమిటెడ్ కాల్స్Published by:Santhosh Kumar S
First published:January 15, 2019, 12:25 IST