SAFETY HACKS YOU SHOULD KNOW TO STAY PROTECTED FROM RISING ONLINE BANKING FRAUDS IN INDIA GH VB
Online Banking Frauds: అన్ని రంగాలకూ విస్తరించిన డిజిటల్ సేవలు.. ఆన్లైన్ మోసాలను గుర్తించడం ఎలా..?
ప్రతీకాత్మక చిత్రం
ఆర్బీఐ సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకులకు, ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడిగినా చెప్పకూడదని అవగాహన కల్పిస్తోంది.
ఇటీవల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు(Digital Transactions) పెరిగిపోయాయి. అన్ని రంగాల్లోనూ డిజిటల్ సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ వేదికగా సైబర్ నేరగాళ్లు వల పన్నుతున్నారు. సమాచారం దొంగిలించడం(Data Theft), సేకరించడంతో పాటు హ్యాకింగ్‌కు(Hacking) కూడా పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ రంగానికి కూడా వీరి నుంచి ముప్పు లేకపోలేదు. ఆన్లైన్ బ్యాంకింగ్(Online Banking), క్రెడిట్, డెబిట్ కార్డుల ట్రాన్సాక్షన్లు, ఏటీఎంలు, పేమెంట్ పోర్టల్(Payment Portal), నెట్ బ్యాంకింగ్(Net Banking) సేవలు వినియోగించే వాటిని హ్యాక్ చేసి నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లో నగదును ఇతర ఖాతాల్లోకి జమ చేసేసుకొంటున్నారు. కొంత కాలంగా జరుగుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే ఎప్పటికప్పుడు కొత్త తరహా పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు ముందుకు వస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆర్గనైజేషన్ అయినా సైబర్ ఎటాక్స్ నుంచి తప్పించుకోవడానికి శ్రమించాలని తెలిపారు.
Vishing:
ఈ మార్గంలోనే ఇండియాలో ఎక్కువ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. బ్యాంకు అధికారి, ఈ-వ్యాలెట్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీసు ప్రొవైడర్స్లా ఫోన్ చేసి బ్యాంకు, ఏటీఎం వంటి వివరాలను సేకరిస్తారు. బాధితులను మాయ చేసి వివరాలు రాబడతారు. KYC అప్టేడ్ చేయాలని, బ్యాంకు అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేయాలని, మీ అకౌంట్లో నగదు జమ అవుతుందని, ఏటీఎం పని చేయదని, సిమ్‌కార్డు యాక్టివేషన్ కోసమని వివిధ రకాల అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించి సమాచారాన్ని తీసుకొంటారు. ఓటీపీలు కూడా తెలుసుకొని క్షణాల్లో నగదును కాజేస్తారు.
Phishing:
ఈ పద్ధతిలో దాదాపు అధికారిక వెబ్సైట్లను పోలిన వెబ్సైట్లు, ఈమెయిల్ అడ్రస్‌లు రూపొందిస్తారు. నిజంగా బ్యాంకు అధికారులు మెయిల్ పంపినట్లు భావించేలా చేస్తారు. మెయిల్లో వారు పంపిన లింక్స్ ద్వారా సమాచాన్ని సేకరిస్తారు.
Remote Access:
ఏదైనా అప్లికేషన్, యాప్‌ను ఫోన్, కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసేలా చేస్తారు. దాని ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. అదే విధంగా పేమెంట్ యాప్‌లోని ‘Collect Request’ ఆప్షన్ ద్వారా నగదు కాజేస్తారు. ఫేక్ పేమెంట్ రిక్వెస్టును ‘Enter Your UPI PIN’ అని పంపుతారు. అక్కడ నొక్కగానే ఆ యూపీఐ అడ్రస్‌కు నగదు సెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో తప్పుడు నంబర్లు, వెబ్సైట్ అడ్రస్సులను ప్రచారం చేస్తారు. ఎవరైనా నమ్మి బ్యాంకువే అనుకొని సంప్రదిస్తే అంతే సంగతులు.
గతేడాది రిపోర్టుల మేరకు ఎక్కువ సైబర్ నేరాలు నెలలోని రెండు, నాలుగో శుక్రవారాల్లో జరిగాయి. మొబైల్ యాప్‌ల ద్వారానే ఎక్కవుగా ప్రజలను మోసం చేశారు. కంప్యూటర్లను వినియోగిస్తే సులువుగా ఎక్కడి నుంచి చేశారో తెలుసుకొనే అవకాశం ఉంది. పని అయిన వెంటనే ఫోన్‌ను పక్కన పడేయవచ్చు, తక్కువ ధరలో కూడా దొరుకుతుంది.
గతేడాది మే 27న ఆర్బీఐ వార్షిక నివేదికలో..‘జాతీయ బ్యాంకులు సోషల్ మీడియా ద్వారా డిజిటల్ బ్యాంకుల సేవలపై విస్తృత అవగాహన కల్పించాయి. సైబర్ నేరగాళ్లకు ఇది మంచి అవకాశం అయింది. లాక్డౌన్ పీరియడ్‌లో డిజిటల్ సేవల పేరిట పెద్ద మొత్తంలో నేరాలకు పాల్పడ్డారు.’ అని పేర్కొంది.
2020-21లో ఎనిమిదేళ్లలో మొదటిసారిగా సైబర్ నేరాలను తక్కువగా బ్యాంకులు చూపించాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ ఏడాదిలో రూ.1.38 ట్రలియన్ల విలువైన నగదును సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు కమర్షియల్ బ్యాంకులు చెప్పాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.1.85 ట్రలియన్లు తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ.36,342 కోట్ల విలువైన అవకతవకలు జరిగాయని బ్యాంకులు పేర్కొంటున్నాయి.
ఎలా ఎదుర్కోవాలి?
ఆర్బీఐ సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకులకు, ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడిగినా చెప్పకూడదని అవగాహన కల్పిస్తోంది. బ్యాంకుల నుంచి వినియోగదారుల ఫోన్లకు సందేశాలు పంపుతోంది. బ్యాంకులు ఎప్పుడూ మిమ్మల్ని వివరాలు అడగవని, ఎవరైనా అడిగితే బ్యాంకు దృష్టికి తీసుకురావాలని అప్రమత్తం చేస్తున్నాయి. తెలియని ఈమెయిల్‌ను ఓపెన్ చేయవద్దని అందులోని లింక్‌ను క్లిక్ చేయకూడదని, ఎక్కడా వివరాలు నమోదు చేయకూడదని తెలుపుతోంది. అధికారిక యాప్ అయితేనే ఇన్స్టాల్ చేయాలని, ఎలాంటి ఆఫర్లను నమ్మి యాప్‌లు డౌన్లోడ్ చేయకూడదని హెచ్చరిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.