Panchjanya: అమెజాన్​ను ఈస్టిండియా కంపెనీతో పోల్చిన పాంచజన్య... సంచలన కథనం ప్రచురించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ మ్యాగజైన్

Panchjanya: అమెజాన్​ను ఈస్టిండియా కంపెనీతో పోల్చిన పాంచజన్య... సంచలన కథనం ప్రచురించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ మ్యాగజైన్ (ప్రతీకాత్మక చిత్రం)

Panchjanya on Amazon | ఇ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్‌ను (Amazon) ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 గా వర్ణించింది ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ అయిన పాంచజన్య. అమెజాన్‌పై తీవ్రమైన విమర్శలు చేసింది.

  • Share this:
టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​పై రాష్ట్రీయ స్వయం సేవక్​​ సంఘ్​ (RSS) అనుబంధ మ్యాగజైన్​ పాంచజన్య (Panchjanya) ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ వేడి చల్లారక ముందే ఇదే పాంచజన్య మ్యాగజైన్​ అమెజాన్​పై (Amazon) విమర్శలు గుప్పించింది. అమెజాన్​ను ఈస్ట్​ ఇండియా కంపెనీతో పోలుస్తూ కవర్ స్టోరీ ప్రచురించింది. ఇటీవల కొత్త జీఎస్టీ పోర్టల్​ (GST Portal) రూపొందించే బాధ్యతలను కేంద్రం ఇన్ఫోసిస్​కు అప్పగించగా.. పోర్టల్​ డిజైన్​లో లోపాల కారణంగా అనేక విమర్శలొచ్చాయి. దీంతో, ఇన్ఫోసిస్​పై అటు కేంద్రం, ఇటు పన్ను చెల్లింపుదారులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే పాంచజన్య సైతం ఇన్ఫోసిస్​పై తీవ్రమైన దాడికి దిగింది. తాజాగా ఈ మ్యాగజైన్ అమెజాన్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించింది.

Poco M3: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,000 లోపే

భారత్​పై గుత్తాధిపత్యం కోసం 18వ శతాబ్ధంలో ఈస్టిండియా కంపెనీ ఏదైతే చేసిందో.. ఇప్పుడు అమెజాన్​ కూడా అదే చేస్తోందని పాంచజన్య పేర్కొంది. భారత మార్కెట్​పై ఏకఛత్రాధిపత్యం సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. అందుకోసం ఇక్కడి ప్రజల రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛను తన చేతుల్లోకి తీసుకునే చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంది. భారత ఈ-మార్కెట్ ప్లాట్‌ఫామ్​ను హస్తగతం చేసుకునేందుకు, అనుకూలమైన పాలసీలను అమలు చేసేందుకు అధికారులకు కోట్లాది రూపాయలు లంచం ఇవ్వడం, ప్రైమ్ వీడియోల ద్వారా భారతీయ సంస్కృతికి విరుద్ధమైన కంటెంట్​ను ప్రసారం చేయడం వంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది.

Oppo Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ 10 ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

ప్రైమ్​ వీడియోస్​లో భారతీయ సంస్కృతికి విరుద్ధమైన కంటెంట్


చిన్న వ్యాపారులకు సహాయపడతామని అమెజాన్ వాగ్దానం చేయడం పెద్ద బూటకమని పేర్కొంది. ఈ సాకుతో అమెజాన్​ తన సొంత కంపెనీలను భారత్​లో ప్రవేశపెట్టిందని ఆరోపించింది. ఇందుకు ఉదాహరణగా క్లౌడ్‌టైల్, అపిరియా వంటి సప్లయర్​ ఏజెన్సీలను సృష్టించినట్లు పేర్కొంది. వీటిలో అమెజాన్​ గణనీయమైన వాటా కలిగి ఉందని, పరోక్షంగా అమెజాన్​ నియంత్రణలోనే ఇవి పనిచేస్తున్నాయని తెలిపింది. మరోవైపు, మొత్తం అమెజాన్ వ్యాపారంలో ఈ రెండు కంపెనీల వాటా 35 శాతంగా ఉందని పేర్కొంది. మొదట భారతీయ సంస్కృతిపై దాడి చేసి, ఆపై మత మార్పిడిని ప్రోత్సహించాలని చూస్తోందని విరుచుకుపడింది.

Flipkart: రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనొచ్చు ఇలా

కాగా, అమెజాన్​ ఓటీటీ ప్లాట్‌ఫారమ్​ ప్రైమ్ వీడియోలో ఇటీవల ప్రసారమైన తాండవ్, పాటల్ లోక్ వెబ్​ సరీస్​లలో హిందూ వ్యతిరేక కంటెంట్‌పై అనేక విమర్శలొచ్చాయి. వీటి ద్వారా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తూ, హిందూ దేవతలను ఎగతాళి చేస్తోందని హిందూ సంస్థలు తీవ్రంగా ఆరోపించాయి. దీంతో కంపెనీ క్షమాపణలు చెప్పి ఆ కంటెంట్​ను తొలగించింది.
Published by:Santhosh Kumar S
First published: