Realme Smart Phones: రూ.9 వేలకే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్‌లు ఇవే

రియల్‌మీ సీ21వై (ఫొటో క్రెడిట్ రియల్‌మీ మొబైల్స్)

రియ‌ల్‌మీ వినియోగ‌దారుల‌కు అదిరిపోయే ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. చైనాకు చెందిన మొబైల్ త‌యారీ దిగ్గ‌జం అయిన రియ‌ల్‌మి(RealMe) కంపెనీ అతి త‌క్కు ధ‌ర‌కు వినియోగ‌దారులకు రూ.9వేల‌కే ఫోన్ అందించ‌నుంది. రియ‌ల్‌మీ సీ21వై ద్వారా ప‌లు ఫీచ‌ర్‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందించ‌నుంది.

  • Share this:
    రియ‌ల్‌మీ వినియోగ‌దారుల‌కు అదిరిపోయే ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. చైనాకు చెందిన మొబైల్ త‌యారీ దిగ్గ‌జం అయిన రియ‌ల్‌మి(RealMe) కంపెనీ అతి త‌క్కు ధ‌ర‌కు వినియోగ‌దారులకు రూ.9వేల‌కే ఫోన్ అందించ‌నుంది. రియ‌ల్‌మీ సీ21వై ద్వారా ప‌లు ఫీచ‌ర్‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందించ‌నుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను(Smart Phone)  ఆగ‌స్టు 23, 2021న ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 20:9 డిస్ ప్లేతో వినియోగ‌దారుల ముందుక వ‌చ్చింది. బ్యాట‌రీ ప‌వ‌ర్ 5000mHAతో మ‌న్నిక‌గా ఇచ్చింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌. దీనిలో స్లో-మోషన్ వీడియోను(1080పీ) వరకు వీడియో రికార్డింగ్(Video Record) చేయవచ్చు. మొత్తం మీద రియల్‌మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది.అందుబాటు ధ‌ర‌లే కాకుండా రియల్‌మీ సీ21వై క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్(Flipkart), రియల్‌మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

    YouTube Videos: ప‌ది ల‌క్ష‌ల కోవిడ్ స‌మాచార వీడియోలను తొల‌గించిన యూట్యూబ్‌.. కార‌ణం తెలుసా




    ఫీచ‌ర్‌లు ఇవే..
    డిస్ ప్లే - 6.5 అంగుళాల హెచ్ డి+
    ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ - ఆండ్రాయిడ్ 11(Android 11), రియల్‌మీ యుఐ
    ప్రాసెసర్ - యునిసోక్ టీ610 ఆక్టా కోర్
    కెమెరా - 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
    5 మెగాపిక్సెల్ కెమెరా(ఎఫ్/2.4 లెన్స్)
    స్టోరేజ్ సామ‌ర్థ్యం - 3జీబీ RAM /32 జీబీ స్టోరేజీ , మ‌రో మోడ‌ట‌ల్‌ 4జీబీ RAM /64 జీబీ స్టోరేజ్
    బ్యాట‌రీ సామ‌ర్థ్యం - 5,000mHA (రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్)
    అద‌న‌న‌పు ఫీచ‌ర్‌లు - 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ వి5.0(Bluetooth 5.0), జీపీఎస్/ ఎ-జీపీఎస్, మైక్రో-యుఎస్ బి, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి.
    ధ‌ర‌లు - రియల్‌మీ సీ21వై 3జీబీ RAM /32జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.8,999
    - 4జీబీ RAM /64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.9,999
    Published by:Sharath Chandra
    First published: