Nokia 8.1: నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్

Nokia 8.1 Discount | నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ మాత్రమే కాదు... 'MATCHDAYS' ప్రోమో కోడ్ ఉపయోగించిన వారికి వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, రూ.4000 విలువైన గిఫ్ట్ కార్డు కూడా ఇస్తోంది నోకియా.

news18-telugu
Updated: June 9, 2019, 6:24 PM IST
Nokia 8.1: నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్
Nokia 8.1: నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి నోకియా గుడ్ న్యూస్ చెప్పింది. నోకియా 8.1 ధరను భారీగా తగ్గించింది. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లపై ఏకంగా రూ.7,000 ధర తగ్గడం విశేషం. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో తగ్గిన ధరలతో నోకియా 8.1 కొనొచ్చు. భారతదేశంలో నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.26,999 ధరతో రిలీజైంది. ప్రస్తుతం నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో రూ.19,999 ధరకే కొనొచ్చు. ఇక 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.29,999 కాగా ప్రస్తుతం రూ.22,999 ధరకే కొనొచ్చు. అమెజాన్‌లో కూడా దాదాపు ఇవే ధరలకు నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి.

నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ మాత్రమే కాదు... 'MATCHDAYS' ప్రోమో కోడ్ ఉపయోగించిన వారికి వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, రూ.4000 విలువైన గిఫ్ట్ కార్డు కూడా ఇస్తోంది నోకియా. 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ కూడా ఉంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు రూ.199 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే 1టీబీ అదనంగా 4జీ డేటా లభిస్తుంది. రూ.499 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్‌లో ఉన్న పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు 120 జీబీ అదనపు డేటా, మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, 1 ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తాయి.

నోకియా 8.1 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.18 ఫుల్‌ హెచ్‌డీ+, 1080x2244 పిక్సెల్స్


ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710రియర్ కెమెరా: 12+13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,500ఎంఏహెచ్ బ్యాటరీ
ధర:
4జీబీ+64జీబీ- రూ.19,999
6జీబీ+128జీబీ- రూ.22,999

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరమో తెలుసా?

IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు