5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

షావోమీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న పోకోఫోన్ సేల్స్ ఇవాళ సంచలనం సృష్టించాయి. కేవలం 5 నిమిషాల్లో రూ.200 కోట్ల విలువైన ఫోన్లను అమ్మేసింది షావోమీ.

news18-telugu
Updated: August 29, 2018, 4:23 PM IST
5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్
Image: News18.com
  • Share this:
షావోమీ... ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో ఓ సంచలనం. ఇండియాలోనే కాదు... ప్రపంచంలోనే ఓ బ్రాండ్ క్రియేట్ చేసింది షావోమీ. గతంలో ఎంఐ, రెడ్‌మీ సిరీస్‌లతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన షావోమీ... ఈసారి మూడో సిరీస్‌తో అడుగుపెడుతూనే సంచలనం సృష్టించింది. పోకోఫోన్ సిరీస్‌లో ఎఫ్ 1 పేరుతో తొలి ఫోన్‌ని ఆగస్ట్ 22న అధికారికంగా లాంఛ్ చేసింది ఆ కంపెనీ. బుధవారం పోకోఫోన్ ఎఫ్‌ 1 సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు Mi.com మొదలయ్యాయి. సేల్ మొదలైన ఐదు నిమిషాల్లోపే ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం 5 నిమిషాల్లో రూ.200 కోట్ల విలువైన ఫోన్లను అమ్మేసింది షావోమీ. తొలి సేల్ సూపర్ హిట్‌ కావడంతో రెండో సేల్‌ని సెప్టెంబర్ 5న ప్రకటించింది కంపెనీ.స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో వచ్చిన ఫోన్లల్లో పోకోఫోన్ రేటు చాలా తక్కువ. అందుకే ఈ ఫోన్‌ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఆశ్చర్యపర్చింది. ఊహించినట్టుగానే తొలిసేల్‌కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1000 తగ్గింపు, రిలయెన్స్ జియో నుంచి రూ.8000 అదనపు లాభాలు లభిస్తాయి. Mi.comలో ఫోన్ కొన్న వారికి హంగామా మ్యూజిక్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

షావోమీ పోకోఫోన్ ఎఫ్1 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 2160×1080 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128జీబీ, 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఎంఐయూఐ 9
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: రూసో రెడ్, బ్లూ, బ్లాక్
ధర:
6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్- రూ.20,999
6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ - రూ.23,999

8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ - రూ.28,999

8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్- రూ.29,999 (స్పెషల్ ఎడిషన్)

ఇవి కూడా చదవండి:

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

లోన్ కావాలా..? గూగుల్‌ని అడగండి!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కాదు... స్నాప్‌చాట్‌దే హవా!
Published by: Santhosh Kumar S
First published: August 29, 2018, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading