Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది

Samsung Galaxy M20 | సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గించింది కంపెనీ. ఓపెన్ సేల్‌లో అమ్మకాలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: May 19, 2019, 12:32 PM IST
Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది
Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది (Image: Samsung)
news18-telugu
Updated: May 19, 2019, 12:32 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది. జనవరిలో సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ ఎం20 రిలీజైంది. కొద్దిరోజుల వరకు ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో మాత్రమే లభించేది. ఇప్పుడు ఓపెన్ సేల్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు... ధర కూడా తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గించింది కంపెనీ. గతంలో 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.10,990 ఉండేది. ప్రస్తుతం రూ.9,990 ధరకే కొనొచ్చు. ఇక 4జీబీ+64జీబీ ధర రూ.12,990 ఉండేది. ప్రస్తుతం రూ.11,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, సాంసంగ్ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనొచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ


ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
కలర్స్: చార్‌కోల్ బ్లాక్, ఓషియన్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,990
4జీబీ+64జీబీ- రూ.11,990

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే


ఇవి కూడా చదవండి:

Redmi Note 7S: షావోమీ నుంచి మరో ఫోన్... రెడ్‌మీ నోట్ 7ఎస్

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి

PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...