స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది. జనవరిలో సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ ఎం20 రిలీజైంది. కొద్దిరోజుల వరకు ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో మాత్రమే లభించేది. ఇప్పుడు ఓపెన్ సేల్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు... ధర కూడా తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గించింది కంపెనీ. గతంలో 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.10,990 ఉండేది. ప్రస్తుతం రూ.9,990 ధరకే కొనొచ్చు. ఇక 4జీబీ+64జీబీ ధర రూ.12,990 ఉండేది. ప్రస్తుతం రూ.11,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, సాంసంగ్ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.