Home /News /technology /

ROYAL ENFIELD HUNTER 350 INDIA LAUNCH IN AUGUST UMG GH

Royal Enfield Hunter 350: డ్రీమ్ బైక్ వచ్చేస్తోందీ.. రైడ్ చేసేందుకు బైక్ లవర్స్ రెడీనా..!

ఆగస్టు నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 రిలీజ్.

ఆగస్టు నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 రిలీజ్.

భారతదేశంలో బైక్ లవర్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మోటార్‌సైకిల్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ బ్రాండ్ బైక్స్‌లో అందించే ప్రత్యేకమైన ఫీచర్లు, డిజైన్స్‌ వల్ల చాలామంది వీటికి ఫ్యాన్స్ కూడా అయిపోయారు. ఈ ఏడాది ఆగస్టు (August) మొదటి వారంలో నిర్వహించనున్న ఓ ఈవెంట్‌లో రాయల్ ఎన్‌?

ఇంకా చదవండి ...
భారతదేశంలో బైక్ లవర్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మోటార్‌సైకిల్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ బ్రాండ్ బైక్స్‌లో అందించే ప్రత్యేకమైన ఫీచర్లు, డిజైన్స్‌ వల్ల చాలామంది వీటికి ఫ్యాన్స్ కూడా అయిపోయారు. అయితే అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ఈ దేశీ కంపెనీ రకరకాల మోడల్స్‌ను లాంచ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త, అత్యంత సరసమైన బైక్‌ను ఇండియన్ మార్కెట్ (Indian Market)లో లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్న ఓ ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)ని కంపెనీ అధికారికంగా ఇండియాలో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కోసం కంపెనీ మీడియా సంస్థలకు ఇప్పటికే ‘బ్లాక్ యువర్ డేట్’ ఇన్విటేషన్ కూడా పంపింది. అయితే ఈ ఈవెంట్‌ అప్‌కమింగ్ బైక్‌ హంటర్ 350 మొదటి రైడ్ ఈవెంట్ కావచ్చని తెలుస్తోంది.

రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా ఎదురుచూస్తున్న అప్‌కమింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో హంటర్ 350 కూడా ఒకటి కావడం విశేషం. ఈ బైక్ భారతీయ రోడ్లపై టెస్ట్ రైడ్ చేస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రొడక్షన్-స్పెసిఫికేషన్ ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. హంటర్ 350 కాంపాక్ట్ బైక్‌గా లాంచ్ కానుందని లీకైన ఫొటోల ప్రకారం తెలుస్తోంది. సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, స్ట్రాంగ్ ఎగ్జాస్ట్‌తో రెట్రో లుక్‌లతో ఈ బైక్ అందుబాటులోకి రావచ్చు. ఫ్లాట్ హ్యాండిల్ బార్, లో-సీటు హైట్, స్మాల్ టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్ల వల్ల దీనిని హైవేలతో పాటు సిటీ స్ట్రీట్స్‌లో నడపడం మరింత ఈజీ అవుతుంది. హంటర్ 350 సోలో రైడర్లకు బాగా సూట్ కావచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో అందించిన పిలియన్ సీట్ చాలా చిన్నదిగా కనిపిస్తోంది.



మెటోర్ 350, క్లాసిక్ 350 తర్వాత కొత్త J-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే మూడో రాయల్ ఎన్‌ఫీల్డ్ bike హంటర్ 350 నిలవనుంది. హంటర్ 350లో 349cc మోటార్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్‌తో కూడిన ఎయిర్ & ఆయిల్-కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ మిడిల్-వెయిట్ బైక్ 20 bhp, 27 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుందని సమాచారం. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. ఫీచర్ల పరంగా చూస్తే, ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ను ఆప్షనల్ యాక్సెసరీగా పొందుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆగస్ట్ 2022లో విడుదల అయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. హంటర్ 350 ధర రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షల రేంజ్‌లో ఉండవచ్చని అంచనా. అంటే లాంచ్ అయ్యాక ఈ బైక్ దేశంలోనే అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అవుతుందని చెప్పవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Bike, Bullet bike, Royal Enfield

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు