Home /News /technology /

ROYAL ENFIELD CONTINENTAL GT 650 MODIFIED VERSION BIKE LAUNCHED PRICE AND FEATURES DETAILS GH EVK

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 మాడిఫైడ్ వెర్షన్ బైక్ విడుదల.. దీని ధర, ఫీచర్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Royal Enfield | ప్రముఖ ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. కాంటినెంటల్ జీటీ 650 మోడల్‌‌‌కు మార్పులు చేసింది. ఈ మాడిఫైడ్ వెర్షన్‌ను ఆస్ట్రేలియాలో జరిగిన బస్టెడ్ నకిల్డ్ బిల్డ్-ఆఫ్ పోటీలో ప్రదర్శించింది. లేబుల్ నెం.55తో GT 650ను ప్రొడక్షన్ రేసర్‌గా ప్రదర్శించారు.

ఇంకా చదవండి ...
ప్రముఖ ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. కాంటినెంటల్ జీటీ 650 మోడల్‌‌‌కు మార్పులు చేసింది. ఈ మాడిఫైడ్ వెర్షన్‌ను ఆస్ట్రేలియాలో జరిగిన బస్టెడ్ నకిల్డ్ బిల్డ్-ఆఫ్ పోటీలో ప్రదర్శించింది. లేబుల్ నెం.55తో GT 650ను ప్రొడక్షన్ రేసర్‌గా ప్రదర్శించారు. ఒరిజినల్ కాంటినెంటల్ GT 650కు ఉన్న రౌండ్ హెడ్‌లైట్‌ను కొత్త ఫైబర్‌గ్లాస్ తో మార్పులు చేశారు. దీంతో ఇది స్పోర్ట్స్ బైక్‌ లుక్‌ను సంతరించుకుంది. ఇది త్వరలోనే రోడ్లపై రైడ్ కానుంది.

Self-Driving Cars: చైనా స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌.. ఎలక్ట్రిక్ రోబో కారు.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌కు భ‌విష్య‌త్‌లో గిరాకీ!

కాంటినెంటల్ GT మాడిఫైడ్ వెర్షన్ సబ్‌ఫ్రేమ్ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఇది ట్రయంఫ్ డేటోనా లాంటి పుల్ అడ్జెస్టబుల్ గోల్డెన్ USD ఫోర్క్‌తో వస్తుంది. వెనుక సస్పెన్షన్ కూడా ఫుల్ అడ్జెస్టబుల్ మోనో-షాక్‌‌తో పాత హోండా స్వింగార్మ్‌ మాదిరిగా ఉంటుంది. ఈ వెర్షన్ బైక్ బ్రిటీష్ సూపర్‌ స్పోర్ట్‌కు సంబంధించిన పిరెల్లీ డయాబ్లో సూపర్‌కోర్సా SC స్లిక్‌లతో 17-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌పై రైడ్ చేయవచ్చు.

ఒరిజినల్ బైక్‌కు బ్రేకింగ్ డ్యూటీలు సింగిల్ 320mm డిస్క్‌ కపుల్‌తో పాటు ముందు భాగంలో బైబ్రే ఫోర్-పిస్టన్ కాలిపర్‌తో రూపొందించారు. వెనుక భాగంలో సింగిల్ 240mm డిస్క్ బ్రేక్‌ ఉంటుంది. అయితే, ఈ మాడిఫైడ్ వెర్షన్‌లో నిస్సిన్ ద్వారా ట్విన్ ఫ్రంట్ డిస్క్, సింగిల్ రియర్ యూనిట్‌ని వినియోగించారు.

Google Features: గూగుల్‌లో కొత్త‌గా అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. ఎలా వినియోగించాలో తెలుసుకోండి

ఒరిజినల్ బైక్‌లో ఉపయోగించిన 650cc ట్విన్ మోటారునే మాడిఫైడ్ వెర్షన్‌లో‌నూ కొనసాగించారు. కానీ ఈ చిన్న మార్పుల ద్వారా పనితీరు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ఒరిజినల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650లో, 650 cc యూనిట్ గరిష్టంగా 47 bhp శక్తిని, 52 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. అదే మాడిఫైడ్ మోడల్‌లో రిస్‌ట్రిక్ట్‌టెడ్ ఎగ్జాస్ట్ ఫ్రీ ఫ్లో యూనిట్‌తో రీప్లేస్ చేశారు. కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 భారతదేశంలో 2017లో లాంచ్ అయింది. రూ. 3.04 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న సంగతి తెలిసిందే.

Motorola: టాప్ క్లాస్ కెమెరా ఫీచ‌ర్స్‌తో మోటో నుంచి కొత్త ఫోన్.. స్పెసిఫికేష‌న్ వివ‌రాలు


రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఎడిషన్స్ ఇప్పటికే కొన్ని ఇప్పటికే టెస్టింగ్ దశకు చేరుకున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గత ఏడాది క్లాసిక్ 350 మార్కెట్లోకి వచ్చింది. అంతకు ముందు సంవత్సరం మిటియర్ 350 మోడల్‌ను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మరికొన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Automobiles, Bikes, Royal Enfield

తదుపరి వార్తలు