Home /News /technology /

Royal Enfield 650: దుమ్మురేపిన రాయల్ ఎన్‌ ఫీల్డ్.., 2 నిమిషాల్లోనే స్టాక్ క్లియర్

Royal Enfield 650: దుమ్మురేపిన రాయల్ ఎన్‌ ఫీల్డ్.., 2 నిమిషాల్లోనే స్టాక్ క్లియర్

రాయల్ ఎన్ ఫిల్డ్-650 (Photo Credit: Facebook)

రాయల్ ఎన్ ఫిల్డ్-650 (Photo Credit: Facebook)

భారత మార్కెట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ (Royal Enfield) లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా కుర్రకారు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం ఓ స్టేటస్లా భావిస్తుంటారు. అందుకే, యూత్ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ఎడిషన్లు రిలీజ్ చేస్తోంది రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ.

ఇంకా చదవండి ...
భారత మార్కెట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా కుర్రకారు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం ఓ స్టేటస్లా భావిస్తుంటారు. అందుకే, యూత్ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ఎడిషన్లు రిలీజ్ చేస్తోంది రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ. ఇటీవలే ఈ కంపెనీ 120 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు ఫ్లాగ్షిప్ ఎడిషన్ 650 సీసీ బైక్ లను లాంచ్ చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ INT 650 (Interceptor INT 650), రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) బైక్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. డిసెంబర్ 6న ఆన్ లైన్లో వీటి బుకింగ్స్ ప్రారంభించింది. అయితే ఈ బైక్ లను బుక్ చేసుకునేందుకు బుల్లెట్ లవర్స్ ఎగబడ్డారు.

భారత్లో 120 బైక్ లను అమ్మకానికి పెట్టగా.. కేవలం 120 సెకన్లలోనే స్టాక్ క్లియర్ అయ్యింది. దీంతో అతి తక్కువ సమయంలో బైక్ లను విక్రయించి సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతటి అద్భుతమైన స్పందనపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ “మా కంపెనీ ప్రారంభించి 120 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650, రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్ లను మార్కెట్లోకి తీసుకొచ్చాం. వీటికి అనూహ్యమైన స్పందన లభించింది. మొత్తం 120 యూనిట్లను విక్రయానికి పెట్టగా.. కేవలం రెండు నిమిషాల్లోనే స్టాక్ పూర్తయ్యింది. కస్టమర్లు మా కంపెనీపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు.” అని తెలిపారు.

ఇది చదవండి: మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 11టీ.., కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ ఎలా ఉన్నాయంటే..?


అమ్మకానికి 120 బైక్ లు మాత్రమే...
మొత్తం 120 యానివర్సరీ ఎడిషన్ బైక్ లు అందుబాటులోకి రాగా.. అందులో ఒక్కో మోడల్ నుంచి 60 బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన మొదట ఎవరు బుక్ చేసుకుంటే వారికే బైక్ లను కంపెనీ రిజర్వ్ చేసింది. కాగా, రాయల్ ఎన్ ఫీల్డ్ యానివర్సరీ 120 బైక్ లను ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే తయారు చేసింది.

ఇది చదవండి: త్వరలో మార్కెట్లోకి Realme 9i.. స్పెసిఫికెషన్లు ఇవే..! ధర ఎంత ఉండొచ్చంటే!


120వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసే బ్యాడ్జ్..
120వ యానివర్సరీ ఎడిషన్ ఇంటర్సెప్టర్ INT 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్ లను యూకే, భారత్కు చెందిన బృందాలు రూపొందించాయి. వీటి ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలను పూర్తిగా బ్లాక్ కలర్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇంజిన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్, బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలతో వీటిని రూపొందించారు. ఈ బైక్లకు 120 ఇయర్స్ డై కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ బ్యాడ్జ్ను భారత్కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు తయారు చేశారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:

Tags: Royal Enfield

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు