హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Romance Scams: పెరుగుతున్న రొమాన్స్ స్కామ్స్... డేటింగ్ యాప్స్ ఇస్తున్న టిప్స్ ఇవే

Romance Scams: పెరుగుతున్న రొమాన్స్ స్కామ్స్... డేటింగ్ యాప్స్ ఇస్తున్న టిప్స్ ఇవే

Romance Scams: పెరుగుతున్న రొమాన్స్ స్కామ్స్... డేటింగ్ యాప్స్ ఇస్తున్న టిప్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Romance Scams: పెరుగుతున్న రొమాన్స్ స్కామ్స్... డేటింగ్ యాప్స్ ఇస్తున్న టిప్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Romance Scams | డేటింగ్ పేరుతో రొమాన్స్ స్కామ్స్ జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అందుకే టిండర్ లాంటి డేటింగ్ యాప్స్ (Dating Apps) కొన్ని టిప్స్ చెబుతున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

డిజిటల్ టెక్నాలజీ వాడకం పెరిగిపోయిన తర్వాత స్కామర్లు (Scammers) ఏ ప్లాట్‌ఫామ్‌నూ వదలడం లేదు. వీరు డేటింగ్ (Dating) వెబ్‌సైట్ లేదా యాప్‌లలో కూడా తమ చేతికి పని చెబుతున్నారు. ఈ యాప్స్‌లో మోసగాళ్లు అమాయక వ్యక్తులతో రొమాంటిక్ చాట్లను జరుపుతూ వారిని వలలో పడేసి అందినకాడికి డబ్బు లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారు. ఆన్‌లైన్ ఫేక్ ఐడెంటిటీలు సృష్టించి వీరు చేసే రొమాంటిక్ ఫ్రాడ్స్‌లో చిక్కి నిండా మోసపోయిన బాధితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు టిండెర్, హింజ్, మ్యాచ్, ప్లెంటీ ఆఫ్ ఫిష్, మీటిక్ (Meetic) వంటి ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లకు మాతృ సంస్థ అయిన మ్యాచ్ గ్రూప్ (Match Group) ఓ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

ఈ క్యాంపెయిన్ ద్వారా ఇన్-యాప్‌ మెసేజెస్, ఈ-మెయిల్ నోటిఫికేషన్లు యూజర్లకు పంపిస్తూ ఆన్‌లైన్‌లో స్కామ్‌కు గురికాకుండా ఎలా జాగ్రత్త పడాలో మ్యాచ్ గ్రూప్ గైడెన్స్ ఇవ్వనుంది. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ TechCrunch ప్రకారం, Tinder, ఫ్రెంచ్ డేటింగ్ యాప్ Meetic యూజర్లకు జాగ్రత్తలు చెప్పే టిప్స్ పంపించనున్నాయి.

Railway Tickets: ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? వెయిటింగ్ లిస్ట్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

పర్ఫెక్ట్‌గా లేదా గుడ్ మ్యాచ్‌లుగా కనిపించే ప్రొఫైల్స్‌ ఫొటోలు వెరిఫై చేయడం, పర్సనల్‌గా మీట్ అయ్యే ముందు వారితో వీడియో చాట్ చేయడం, స్కామర్ రెడ్ ఫ్లాగ్‌లను ఎలా గుర్తించాలో నేర్చుకోవడం వంటి టిప్స్ వీటిలో కొన్ని. అంతేకాకుండా Match, Hinge, Plenty of Fish, OurTime వంటి ఇతర డేటింగ్ యాప్‌లు అదే స్కామ్-సంబంధిత టిప్స్‌ను యూజర్లకు ఈ-మెయిల్స్‌, మెసేజ్ నోటిఫికేషన్లగా పంపుతాయని TechCrunch నివేదిక పేర్కొంది.

యూఎస్, ఇండియా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీతో సహా 15 కంటే ఎక్కువ దేశాల్లో ఈ గ్లోబల్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను మ్యాచ్ గ్రూప్ ప్రారంభిస్తుంది. మ్యాచ్ గ్రూప్‌లోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ సీనియర్ డైరెక్టర్ బడ్డీ లూమిస్ మాట్లాడుతూ.. స్కామర్లు తరచుగా చాలా ఓపికతో ఉండి సాధారణ ప్రజలతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారని.. వారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి తగినంత సమయం ఇన్వెస్ట్ చేస్తారని వివరించారు.

Railway Passengers: జనరల్ టికెట్‌తో స్లీపర్ కోచుల్లో ప్రయాణం... రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఇలా చేయడం ద్వారా బాధితులు వారిని నమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా ఆ నమ్మకం కుదిరినప్పుడే పిల్లల మెడికల్ బిల్లు, వీసా లేదా విమాన టికెట్ కోసం డబ్బు లేదా ఇంకేదైనా కారణం చెప్పి డబ్బులు ఇవ్వాలని అడుగుతారని లూమిస్ వెల్లడించారు.

డబ్బులు అవసరం ఉన్నాయని చెబుతూ డబ్బు అడిగే వారిని ఎప్పుడూ కూడా నమ్మొద్దని ఆయన సూచించారు. ఆర్థిక నిపుణుల సహాయంతో తీసుకొచ్చిన ఈ టిప్స్ జనవరి నెలంతా యాప్స్‌లో కనిపిస్తూ యూజర్లకు సురక్షితంగా ఎలా ఉండాలో తెలుపుతాయి. కొందరు స్కామర్లు డేటింగ్ యాప్‌లో కాకుండా వేరే లింక్స్ ఇచ్చి వాటిని క్లిక్ చేయమని చెప్తారు. అలా ఎప్పుడూ చేయకుండా మీరు మీ డేటింగ్ యాప్‌లో ఉంటూనే వారి గురించి తెలుసుకోవాలి.

BIS Standards: సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండా ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్స్ చూసే ఛాన్స్

వారు తమ గురించి ఫలానా లింకులు అన్ని వివరాలు ఉన్నాయని చెప్పిన వాటిని క్లిక్ చేయకూడదు. కొందరు కొంత డబ్బు ఇస్తే వాటికి రెట్టింపు డబ్బులు ఇస్తామని కూడా నమ్మబలుకుతారు. వీటిని నమ్మి అత్యాశకు పోకూడదని ఆ టిప్స్ యూజర్లకు తెలియజేయునన్నాయి. ఈ విధంగా టిప్స్ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ స్కామ్‌ల సంఖ్య తగ్గించనున్నాయి.

First published:

Tags: Dating, Dating App, Fraud, Scams

ఉత్తమ కథలు