CES 2019: 'సెక్స్ టాయ్' వివాదం... ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకున్న నిర్వాహకులు

CES 2019 | ఇండిపెండెంట్ ప్యానెల్ ఆఫ్ జడ్జీలు రోబోటిక్స్ అండ్ డ్రోన్ కేటగిరీలో CES 2019 ఇన్నోవేషన్ హానరీ అవార్డుకు లోరా డికార్లో స్టార్టప్ తయారు చేసిన సెక్స్‌ టాయ్‌ని ఎంపిక చేశారు. కానీ తర్వాత తమ ప్రస్తుత ప్రొడక్ట్ కేటగిరీలకు సెక్స్ టాయ్ తగినది కాదని తేల్చేశారు.

news18-telugu
Updated: January 11, 2019, 3:29 PM IST
CES 2019: 'సెక్స్ టాయ్' వివాదం... ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకున్న నిర్వాహకులు
CES 2019: 'సెక్స్ టాయ్' దుమారం... ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకున్న నిర్వాహకులు Image: Lora DiCarlo website
news18-telugu
Updated: January 11, 2019, 3:29 PM IST
సెక్స్‌ టాయ్‌ని గొప్ప ఆవిష్కరణగా గుర్తించి 2019 ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో(CES)లో అవార్డు ఇచ్చిన వ్యవహారం మలుపు తిరిగింది. నిర్వాహకులు ఆ అవార్డును వెనక్కి తీసుకోవడమే కాదు... సెక్స్ టాయ్‌ని నిషేధించారు కూడా. లోరా డికార్లో స్టార్టప్ మహిళల కోసం రూపొందించిన సెక్స్‌ టాయ్‌ని సీఈఎస్ 2019లో ప్రదర్శించారు. ఈ ఆవిష్కరణకు ఇన్నోవేషన్ అవార్డ్ కూడా లభించింది. సెక్స్ టాయ్‌కు అవార్డు ఇవ్వడం వివాదానికి కారణమైంది. దాంతో నిర్వాహకులు అది 'అనైతికం' అంటూ అవార్డును వెనక్కి తీసుకున్నారు. అంతే కాదు... ఆ సెక్స్ టాయ్‌ని షోలో ప్రదర్శించకుండా నిషేధించారు.

షో నిర్వాహకులైన కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్(CTA) సదరు స్టార్టప్ నిర్వాహకులకు అనర్హతకు గల కారణాలను వివరిస్తూ ఇ-మెయిల్ రాశారు. "ఇది పూర్తిగా అనైతికం, అశ్లీలం, అపవిత్రం" అంటూ ఘాటుగానే సమాధానమిచ్చాయి. అయితే సెక్స్‌ టాయ్‌ని నిషేధించినందుకు కూడా CES, CTA విమర్శలు ఎదుర్కోవడం మరో ట్విస్ట్. నిర్వాహకులు లింగపక్షపాతం, సెక్సిజం, మూర్ఖత్వం, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఓజ్ వైబ్రేటర్ తయారు చేసిన లోరా డికార్లో స్టార్టప్ సీఈఓ లోరా హాడాక్ విమర్శించారు.

ఇండిపెండెంట్ ప్యానెల్ ఆఫ్ జడ్జీలు రోబోటిక్స్ అండ్ డ్రోన్ కేటగిరీలో CES 2019 ఇన్నోవేషన్ హానరీ అవార్డుకు లోరా డికార్లో స్టార్టప్ తయారు చేసిన సెక్స్‌ టాయ్‌ని ఎంపిక చేశారు. కానీ తర్వాత తమ ప్రస్తుత ప్రొడక్ట్ కేటగిరీలకు సెక్స్ టాయ్ తగినది కాదని తేల్చేశారు. "పురుషుల లైంగికత కోసం రూపొందించే మహిళల సెక్స్‌ రోబోను, వీఆర్ పోర్న్‌ను అనుమతిస్తారు కానీ, మహిళల లైంగికతకోసం రూపొందించిన గ్యాడ్జెట్‌పై నిషేధం విధించి పక్షపాతం చూపిస్తున్నారు" అంటూ లోరా హాడాక్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:



Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకులకు ఆమెతో ఎఫైర్ కారణమా?

Photos: కలర్‌ఫుల్‌గా చైనాలో ఐస్ ఫెస్టివల్... ఆ అందాలు చూడండి

తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల్లో రెండో స్థానంలో హంపి

 
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...