ROBOT BARTENDER SERVING COCKTAILS TO CUSTOMERS IN SWITZERLAND BARS FULL DEMAND DUE TO CORONA PANDEMIC SITUATION GH HSN
Robot Bartender: ఇది అలాంటిలాంటి రోబో కాదు.. బార్లలో కస్టమర్లకు నచ్చేట్టుగా కాక్టైల్ కలిపి జోకులు పేల్చుతోంది..!
Robot Bartender (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రోబో అలాంటిలాంటిది కాదు. కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించే వరకు అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. డజన్లకొద్దీ కాక్‌టైల్స్‌ను సులభంగా కలిపేస్తుంది. బార్‌కు వచ్చేవారి మూడ్‌కు తగ్గట్టు జోకులు వేస్తూ..
టెక్నాలజీ సాయంతో మనుషుల పని భారాన్ని తగ్గించేందుకు రోబోలను రూపొందిస్తున్నారు పరిశోధకులు. ఇటీవల ఒక రోబో న్యూస్ రీడర్.. వార్తలు చదివి సంచలనం సృష్టించింది. సమయాన్ని, ఖర్చును ఆదాచేసే ఇలాంటి రోబోల వాడకం పెరుగుతోంది. తాజాగా స్విట్జర్లాండ్‌లోని ఒక బార్ యజమానులు బార్ని అనే రోబోకు బార్టెండర్గా (బార్లలో డ్రింక్స్ అందించేవారు) బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బార్ని సమర్థవంతంగా పని చేస్తోంది. తన పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటోది. కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించే వరకు అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. బార్ని మామూలు బార్టెండర్ కాదు. ఇది డజన్లకొద్దీ కాక్‌టైల్స్‌ను సులభంగా కలిపేస్తుంది. బార్‌కు వచ్చేవారి మూడ్‌కు తగ్గట్టు జోకులు వేస్తూ వారిని నవ్విస్తోంది. ఎఫ్&పి రోబోటిక్స్ అనే సంస్థ దీన్ని అబివృద్ధి చేసింది. దీని కారణంగా బార్‌కు `ది బార్ని బార్` అనే పేరు వచ్చింది.
కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాల్సి రావడంతో హోటళ్లలో, బార్లో, షాపింగ్ మాల్స్‌లో రోబోల వినియోగం పెరింది. రానున్న రోజుల్లో వీటి అవసరం మరింత పెరిగే అవకాశం ఉంది. బార్టెండర్గా పనిచేస్తున్న బార్ని 16 రకాల స్పిరిట్లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్టైల్స్ (Cocktail) తయారు చేయగలదు. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ చేస్తుంది. బీర్, ప్రొసెక్కొ (Prosecco)లను కూడా బార్నీ కస్టమర్లకు అందిస్తుంది. ఇంకా, బార్పైన వేలాడే పెద్ద వీడియో డిస్ ప్లేలో కస్టమర్ల డ్రింక్ రెడీగా ఉందని చెబుతుంది. బార్నీ తన రొబోటిక్ చేతులను శానిటైజ్ చేసుకోవడం విశేషం. తమ బార్‌కు బార్ని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని చెబుతున్నారు బార్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ జెరి కొలంబో.
రోజంతా అలిసిపోకుండా పనిచేయడం, కస్టమర్లకు కచ్చితంగా ఏం కావాలో అవే అందించడం వల్ల బార్లు, రెస్టారెంట్లలో రోబోల వాడకం పెరుగుతోంది. కరోనా సమయంలో బార్టెండర్గా పనిచేసే వ్యక్తులకు బదులుగా బార్ని రోబో వాడకం మంచి విషయమని బార్ కస్టమర్లు చెబుతున్నారు. ఈ రోబోలను, వాటి ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తున్న జ్యూరిచ్ కంపెనీ ఇప్పటికే చైనా, ఒమన్ దేశాలకు రోబోలను అమ్మింది. అక్కడ షాపింగ్‌మాల్స్‌లో ఇవి కస్టమర్లకు వివిధ రకాల సేవలందిస్తున్నాయి.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.