HOME »NEWS »TECHNOLOGY »robodoc how indias robots are taking on covid patient care read the interesting story here ms gh

RoboDoc: కోవిడ్ పేషెంట్ల సేవలో రోబో డాక్టర్లు.. రోగులకు ‘మిత్ర‘ సాయం చేస్తున్న రోబోలు..

RoboDoc: కోవిడ్ పేషెంట్ల సేవలో రోబో డాక్టర్లు.. రోగులకు ‘మిత్ర‘ సాయం చేస్తున్న రోబోలు..
ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి (Corona pandemic) దాపురించాక ఆసుపత్రులు, వైద్య సిబ్బంది చాలక ప్రపంచమంతా నానా అవస్థలు పడుతోన్న సమయంలో మానవాళికి అండగా నిలబడింది రోబోలే. రేయింబవళ్లు ఆసుపత్రుల్లో రోబోలు కోవిడ్ రోగులకు వివిధ సేవలు చేస్తున్నాయి.

  • News18
  • Last Updated: December 29, 2020, 16:32 IST
  • Share this:
వైద్య సిబ్బందికి సైతం కరోనా సోకే ప్రమాదాలు అత్యధికంగా ఉన్న సమయంలో మిత్ర (Mitra) వంటి రోబోలు వైద్య విధులు అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. ఆసుపత్రిలో కలియ తిరుగుతున్న మిత్ర ఫేషియల్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగిస్తున్న దీన్ని బెంగళూరు స్టార్టప్ ఇన్వెంటో రోబోటిక్స్ ఇటీవలే రూపకల్పన చేసింది. మిత్ర ధర సుమారు 13,600 డాలర్లు కాగా మనదేశంలో ఇప్పుడిది అత్యంత ప్రజాదరణ పొందుతున్న రోబోగా నిలుస్తోంది. ఇవాంకా ట్రంప్ రాకసందర్భంగా మార్కెట్లోకి అడుగుపెట్టిన మిత్ర ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో సిబ్బందిగా మారిపోయింది. కేర్ హోమ్స్ కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినప్పటికీ కరోనా మహమ్మారి సమయంలో ఇది తల్లో నాలుకలా వైద్యరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

మనదేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఐదు దేశాల్లో ఇప్పుడు మిత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. మనదేశం India విషయానికి వస్తే ప్రతి 10,000 మంది పనివారిలో ఒకటిగా మాత్రమే మిత్ర మిగిలింది. పరిశ్రమల్లో రోబోటిక్స్ ను ప్రవేశపెడుతున్న టాప్ 10 దేశాల్లో మనదేశం ఒకటిగా నిలిచిందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ International Federation of Robotics (IFR) వెల్లడించింది. దీంతో ఇండస్ట్రియల్ రోబోట్ సేల్స్ గతంలో ఎన్నడూ లేనంతగా సరికొత్త రికార్డు సృష్టిస్తూ 4,771కి ఆ సంఖ్య చేరింది. గతేడాదికంటే ఇది 39శాతం ఎక్కువ కావటం విశేషం.పెరగనున్న రోబో మార్కెట్

రోబోటిక్స్ మార్కెట్ మనదేశంలో 20శాతం పెరుగుతుందని 2017-2025 మధ్య కాలంలో ఇదంతా సాధ్యమవుతుందనే అంచనాలున్నాయిAccording to the daily Business Standard. ఉత్పత్తి ఖర్చు తగ్గించుకునేందుకు ఆటోమేషన్ బాటపట్టిన హోటళ్లు, ఆసుపత్రులు వంటి రంగాలు క్రమంగా రోబోలపై ఆధారపడుతున్నాయి. అంతేకాదు కేరళకు చెందిన Genrobotics అనే కంపెనీ సీవేజ్ వంటివి క్లీన్ చేసేందుకు మ్యాన్ హోల్స్ లో మనుషులు దిగకుండా రోబో సాయంతో వీటిని శుభ్రం చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో అత్యంత అమానవీయమైన, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ విధానానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పడం సాధ్యమవుతుంది. మనదేశంలోని 11 రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి రోబోల సేవలను వినియోగిస్తుండగా ప్రపంచంలో ఇలా మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబోలను Hand to Hand India వాడుతున్న మొట్టమొదటి దేశంగా మనదేశం నిలుస్తోంది.ఆర్మీలోనూ రోబోలు

'దక్ష్' (Daksh) అనే రోబోట్స్ సేవలను 2011 నుంచి మన సైన్యం విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఎక్స్ రే విజన్, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ హజార్డ్ డిటెక్షన్ మెకానిజమ్స్ అనే సాంకేతికతలను అందిపుచ్చుకున్న దక్ష్ రోబోలు సైన్యానికి సాయపడుతున్నాయి. ఇక వ్యవసాయ గిడ్డంగుల్లోనూ ఆటోమేషన్ మొదలవ్వగా ఇందుకు అనుగుణంగా సేవలు చేసే రోబోట్స్ ను GreyOrange అనే ఢిల్లీకి చెందిన సంస్థ తయారుచేస్తోంది. ఐఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం మనదేశంలోని ఆటోమోటివ్ సెక్టార్లో అత్యధికంగా ఇండస్ట్రియల్ రోబోట్స్ ను ఉపయోగిస్తున్నారు. మారుతి సుజుకి ఇండియా మానేసర్, గుర్గావ్ ప్లాంట్స్ లో రోబోట్స్ ఉపయోగిస్తుండగా, నాశిక్ లోని మహీంద్రా ప్లాంట్లో రోబోటిక్ వెల్డింగ్ లైన్ ఉంది. అత్యధిక బరువైన లోడ్లు ఎత్తేందుకు టాటా మోటర్స్ మనదేశంలోనే తయారైన ఇండస్ట్రియల్ రోబోలను ఉపయోగిస్తోంది.

పీపీఈల కొరత..

పీపీఈ కిట్ల కొరత కారణంగా కరోనా మహమ్మారి సమయంలో వైద్యం అందించేందుకు, తమ వైద్యులకు కరోనా సోకకుండా ఉండే చర్యల్లో భాగంగా మనదేశంలోని పలు ఆసుపత్రులు రోబోలను ప్రయోగిస్తున్నాయి. కరోనాకు ముందు కేవలం సర్జరీలకు మాత్రమే రోబో సేవలను ఉపయోగించే ఆసుపత్రుల్లో బలమైన అతినీలలోహిత కిరణాల ద్వారా డిస్ ఇన్ఫెక్టంట్ చేసేందుకు రోబోలను ఉపయోగించటం మొదలుపెట్టారు. అత్యంత క్లిష్టమైన సర్జరీలను సైతం కచ్ఛితంగా పూర్తి చేసేలా 10 రెట్లు మ్యాగ్నిఫికేషన్తో, 3డీ వ్యూతో అత్యాధఉనిక టెక్నాలజీ ఉన్న రోబోలు వైద్యులకు సాయపడతాయి.

ఇంటి పనుల కోసం

హ్యూమన్ టెక్ రోబోలైతే ఇంటి పనుల్లో విశేషంగా సాయపడతున్నాయి. ఇల్లు తుడవటం, స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయటం వంటి పనులన్నీ క్షణాల్లో ఈ రోబోలు చేసిపెడతాయి. కాబట్టి ఇళ్లలో వాడే రోబోలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. హ్యూమనాయిడ్స్ (humanoids) తో టెంపరేచర్ చెక్ చేయటం, డాక్టర్లకు ఫోన్ కాల్స్ అరేంజ్ చేయటం, ఆసుపత్రిని డిస్ ఇన్ఫెక్టంక్ చేయటంలో ఇవి చక్కగా పనిచేస్తున్నాయి. సేవా రంగంలో ఇంత బాగా పనిచేస్తున్నప్పటికీ మనదేశంలో రోబోలు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం రోబో టెక్నాలజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు అయ్యే కస్టమ్స్ డ్యూటీలు ఎక్కువగా ఉండటమే. అంతేకాదు కూలీ రేట్లు తక్కువగా ఉన్న మనదేశంలో కూలీల సంఖ్య కూడా అపరమితంగా ఉండటంతో రోబోలపై ఆధారపడాలనే ఆలోచన చాలా తక్కువ. మరోవైపు రోబోలను ఉపయోగిస్తూపోతే భవిష్యత్తులో నిరుద్యోగం పెరిగిపోతుందనే భయం కూడా మనల్ని వేధిస్తోంది. ఇక పూర్ వైఫై టెక్నాలజీ ఉండటంతో రోబోలను మానిటర్ చేయటం కష్టంగా మారుతోంది.
Published by:Srinivas Munigala
First published:December 29, 2020, 16:32 IST