పాప్‌కార్న్ అమ్ముకునే వ్యక్తికి సొంత హెలికాప్టర్.. కథేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. దాంతో పాఠశాల చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. 8వ తరగతిలోనే స్కూల్‌కు గుడ్‌బై చెప్పిన అతడు.. తల్లికి చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనులు చేసేవాడు.

news18-telugu
Updated: May 7, 2019, 11:22 AM IST
పాప్‌కార్న్ అమ్ముకునే వ్యక్తికి సొంత హెలికాప్టర్.. కథేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్లేన్‌తో మహమ్మద్ ఫయాజ్
news18-telugu
Updated: May 7, 2019, 11:22 AM IST
అతడు పాప్‌కార్న్ అమ్ముకునే వ్యక్తి.. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థతి.. అలాంటిది ఆయనకు సొంతంగా ఒక హెలికాప్టర్ ఉంది. పాప్‌కార్న్ అమ్ముకునే వ్యక్తికి హెలికాప్టరా? అని ఆశ్చర్యపోయారా? ఎంత కష్టపడినా రోజుకు వెయ్యి రూపాయలకు మించి సంపాదించలేని అతడు సొంతంగా హెలికాప్టర్ కొనే స్థాయికి ఎదిగాడా? అని సందేహిస్తున్నారా? అవును.. అతడికి నిజంగానే హెలికాప్టర్ ఉంది. దానిలో ఆయనే స్వయంగా విహరిస్తారు కూడా. అసలు కథ ఏంటంటే.. పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్‌కు చదువంటే పిచ్చి. కానీ, అతడి తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక చదివించలేదు. చదువు లేకపోతేనేం.. తన మేధస్సుతో ఆవిష్కరణలకు తెర తీశాడు. తానే సొంతంగా ఏదైనా తయారు చేయాలని తలచి ఆ దిశగా అడుగులు వేసి సొంతంగా హెలికాప్టర్‌ను తయారు చేశాడు.

గాలిలో ప్రయాణించాలన్న కలతో..
చిన్నప్పటి నుంచే ఫయాజ్(32)కు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలన్న కోరిక. కానీ, బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. దాంతో పాఠశాల చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. 8వ తరగతిలోనే స్కూల్‌కు గుడ్‌బై చెప్పిన అతడు.. తల్లికి చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనులు చేసేవాడు. ఉదయం పూట పాప్‌కార్న్ అమ్ముకుంటూ రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. గాలిలో ప్రయాణించాలన్న కోరికను మాత్రం చంపుకోని ఫయాజ్.. తాను విమానం ఎక్కాలంటే ఆర్థిక స్థోమత సరిపోదని గ్రహించాడు.

అయితే, తానే సొంతంగా ఓ హెలికాప్టర్‌ను తయారు చేస్తే...! ఆ ఆలోచనే అతడ్ని ముందుకు నడిపించింది. నేషనల్ జియోగ్రఫిక్ ఛానళ్లలో వచ్చే ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ వార్తలను నిషితంగా గమనించేవాడు. అలా పీడనం, టార్క్, చోదన శక్తి గురించి తెలుసుకున్నాడు. ఆన్‌లైన్‌లో విమానాల బ్లూప్రింట్లను సేకరించి తన చేతులకు పనిచెప్పాడు. తన వద్ద ఉన్న అతి తక్కువ డబ్బుతోనే అవసరమైన పరికరాలు కొనేవాడు. అలా, దానికి రోడ్ కట్టర్ ఇంజన్, ఆటో రిక్షా నుంచి సేకరించిన చక్రాలు, జనపనారతో తయారుచేసిన రెక్కలు అమర్చి ఒక హెలికాప్టర్‌ను సిద్ధం చేశాడు. అయితే, తొలి ట్రయల్ ఫెయిల్ అయ్యింది. కొన్ని పరికరాలు,డిజైన్ మార్చాల్సి వచ్చేది. అలా తన సమయాన్ని వృథా చేసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు దాన్ని వదిలేయాలని సూచించేవాళ్లు అయినా పట్టుదలతో హెలికాప్టర్‌ను సిద్ధం చేసి ఈ ఫిబ్రవరిలో స్నేహితుల సలహాతో మరో సారి ట్రయల్ నిర్వహించాడు.జైలు పాలు చేసిన ప్రయోగం
ఆ సమయంలో ఆ హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే కంటే ముందు రన్‌వేపై 120 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించింది. అయితే, ఫయాజ్‌ను చాలా మంది విమర్శించేవాళ్లు. మార్చి 23న పాకిస్థాన్ డే రోజున తన ప్రయోగాన్ని చూపించేందుకు రెడీ అవుతుండగా పోలీసులు వచ్చి ఫయాజ్‌ను అరెస్టు చేశారు. ఆ ప్లేన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే, ఆ ప్లేన్ వల్ల భద్రత ముప్పు ఉందన్న కారణంతో.. రూ.3వేల ఫైన్ వేసి విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్ ఏవియేషన్ అధికారులు ఫయాజ్‌ను కొనియాడి, ఆ ప్లేన్‌ను తిరిగి ఇప్పించారు. అంతేకాదు ఆ హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఆ విమానాన్ని చూడ్డానికి రెండు పాక్ వైమానిక బృందాలు ఆయన తలుపు తట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫయాజ్ హీరోగా మారిపోయాడు.
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...